RGV Shapadham Releasing as web series: RGV వ్యూహం AP ఫైబర్ నెట్ లో శపథం రెండు భాగాలుగా స్ట్రీమింగ్ ! ఎప్పటినుండి అంటే!

20240308 004419 e1709838985501

కోర్టు, సెన్సార్ అడ్డంకులు దాటుకొని వ్యూహం క్రితం వారం థియేటర్స్ లొ విడుదల అయ్యింది. కాని ఈ వారం విడుదల అవ్వ వలసిన శపథం మాత్రం ఇప్పటి వరకూ సెన్సార్ క్లియరెన్స్ లేక ఓటిటి నే దిక్కు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ శపథం సినిమా నీ రెండూ పార్టీలు వెబ్ సీరీస్ గా విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

RGV Shapadam Movie March 8th

ఈ సందర్భంగా RGV మీడియాకి లేఖ రాశారు. దాని సారాంశం ఏంటంటే..వేరు వేరు అడ్డంకుల మూలాన తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ వ్యూహం మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది ..

కానీ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1 ని ఈ రోజు సాయంత్రం మార్చ్ 7 th 8 PM కి, అలాగే శపథం అంతం చాప్టర్ 2 ని రేపు మార్చ్ 8 th 8 pm కి ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లొ AP ఫైబర్ నెట్ లొ OTT App @ద్వారా పే పర్ వ్యూ లొ చూసుకోవటానికి అవకాశం కలిపిస్తున్నాము ..

ఆ తర్వాత అంచెలవారీగా అన్ని ప్లాటుఫార్మ్స్ లొ రిలీజ్ అవుతాయి .. శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన ఉద్దేశ్యం ఏమీ దాచకుండా పాచ్చ్చి నిజాలు చూపించడానికి మాత్రమే  అని పేర్కొన్నారు.

20240308 004433 1

నిన్న  రామ్ గోపాల్ వర్మ విజయవాడ లో మీడియా తో మాట్లాడుతూ : వైసీపీ ప్రభుత్వం( YCP Govt )లో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.మొన్ననే వ్యూహం సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వగా. శపథం సినిమా( Shapadam ) మార్చి 8వ తారీకు నుండి.

ఏపీ ఫైబర్ నెట్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఎలక్షన్స్ సమయంలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ఈ చిత్రాలు ఏపీ రాజకీయాలలో( AP Politics ) సంచలనంగా మారాయి.

rgv 2

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం రాజకీయంగా జగన్ ఎదుర్కొన్న సమస్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం వంటి విషయాలను ఆధారం చేసుకుని ఆర్జీవి ఈ సినిమాలు చిత్రీకరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *