Rewind Movie Review & Rating: తక్కువ బడ్జెట్ లో చక్కని టైమ్ ట్రవెల్ డ్రామా!

InShot 20241018 183508866 e1729257040753

చిత్రం: రివైండ్,

విడుదల: 18-10-2024,

నటీనటులు :సాయి రోణక్, అమృత చౌదరి, సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు

నిర్మాణం : క్రాస్ వైర్ క్రియేషన్స్,

మ్యూజిక్ : ఆశీర్వాద్,

సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్,

ఎడిటర్ : తుషార పాలా,

స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : కళ్యాణ్ చక్రవర్తి,

మూవీ: రివైండ్ రివ్యూ  ( Rewind Movie Review) :  సాయి రోణక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం రివైండ్.

ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా, తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం

కధ పరిశీలిస్తే (Story Line): 

ఒక సాఫ్ట్ వేర్ కంపెనిలో పని చేసే కార్తీక్ (సాయి రోణక్) తన అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె తన ఆఫీసులోనే పనిచేస్తుంది అనే విషయం తెలిసి మరింత సంబరపడతాడు.

ఆమెకు తన ప్రేమ విషయం చెప్పేలోపే ఆమె తనకు ఒక ప్రియుడు ఉన్నాడన్న షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే శాంతి తాత(సామ్రాట్)కు చెందిన ఒక బ్యాగ్ తన ఇంట్లోనే ఉందని తెలుసుకుని కార్తీక్ ఒకరోజు దాని ద్వారా టైం ట్రావెల్ చేయడానికి సిద్ధమవుతాడు.

శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని కలవకుండా చేస్తే తాను శాంతి ప్రేమలో పడచ్చని అలా చేస్తాడు.

అలా టైం ట్రావెల్ ద్వారా వెనక్కి వెళ్లిన కార్తీక్ ఏమి చేశాడు?

టైం ట్రావెల్ చేసిన కార్తీక్ గతాన్ని మార్చగలిగాడా?

అసలు శాంతి తాతకు చెందిన బ్యాగ్ కార్తీక్ ఇంటికి ఎలా వచ్చింది?

వెనక్కి వెళ్లిన కార్తీక్ తన తండ్రి(సురేష్) చావుని తప్పించగలిగాడా?

కార్తీక్ శాంతిల ప్రేమ ఫలించిందా ? 

శాంతి తాత గతం నుండీ 2019 లోకి ఎందుకు వచ్చాడు ?

 శాంతి తన తాత కనిపెట్టిన టైం  మిషన్ ఎందుకు వద్దు అనుకోంది ?

చివరకు కధ ఏలా ముగిసింది?

అనే విషయాలు తెలియాలంటే రీవైండ్ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

rewind postar

కధనం పరిశీలిస్తే (Screen – Play):

దర్శకుడు కల్యాణ్ చక్రవర్తి ఎంచుకొన్న కధ కొంచెం కంప్లి కేట్ అయినా తన స్క్రీన్ ప్లే చక్కగా మలిచాడు.

రైవైండ్ సినిమా టైం ట్రావెల్ కధ గా మొదలు పెట్టి చిన్న క్యూట్ లవ్ స్టొరీ గా మార్చిన విధానం కూడా బాగా సెట్ అయింది.

మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లో ఒకరి రెండు సీన్లు కొంచెం బొర్ గా ఉన్నా రెండవ అంకం ( సెకండ్ ఆఫ్) స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రేక్షకులు కథలో లినమవుతారు.

ఓవరాల్ గా లవ్ స్టోరీ, ఫాదర్ సెంటిమెంట్ తో చిన్న చిన్న ట్విస్టులతో బాగానే ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ తో బాగానే తీశారు.

ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఉంటే సినిమా రేంజ్ పెరిగేది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

 దర్శకుడిగా కల్యాణ్ చక్రవర్తి రెవైండ్ సినిమా ద్వారా సక్సెస్ అందుకొన్నట్టే. ఏ సినిమా కి పనిచేయకుండా చదివి నేర్చుకొని, కధ కథనం రాసుకొని నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన దర్శకుడు కల్యాణ్ చక్రవర్తి నీ మెచ్చుకో వలసిందే.

చిన్న చిన్న ట్విస్టులతో మంచి స్క్రీన్ ప్లే తో పాత్రలకు తగ్గ నటి నటులను ఎన్నుకోవడం లో దర్శకుడి ప్రతిభ కనిపించినది.

 సాయి రోనాక్  కార్తీక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒక పోష్ కుర్రాడిగా కనిపిస్తూ అలరించాడు.

 అమృత చౌదరి శాంతి పాత్రలో ఒదిగిపోయింది. ఒకపక్క అందంగా కనిపిస్తూనే మరో పక్కన తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరి పెయిర్ బాగా స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది.

 సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఆశీర్వాద్ సంగీత దర్శకుడుగా ఆకట్టుకున్నారు. పాటల కూడా వినడానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల సాంగ్, సాఫ్ట్ వెర్ సాంగు చాలా బాగున్నాయి.

శివ రామ్ చరణ్ అందించిన ఫోటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. ప్రతీ ఫ్రేం కలర్ ఫుల్ గా ఉంది.

తుషార పాలా ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది.

క్రాస్ వైర్ క్రియేషన్స్ నిర్మాణం విలువలు బాగున్నాయి సినిమా చాలా రిచ్ గా కనిపించింది.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగులోనే కాదు అనేక భాషల్లో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఒక రకంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.

సినిమా మొదలైన వెంటనే ఈ విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పేసాడు డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి . సినిమా మొదలైన తర్వాత కృష్ణ మూర్తి  (సామ్రాట్) తన కుటుంబాన్ని తానే వెతుక్కుంటూ రావడంతో ఆసక్తి మొదలవుతుంది.

తర్వాత సామ్రాట్ మాయమవడం ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా నడిపించాడు డైరెక్టర్. కరెక్ట్ గా ఇంటర్వెల్ సమయానికి అనేక ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేసి సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క దాని చిక్కుముడి విప్పుతూ వెళ్ళాడు డైరెక్టర్.

అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సెకండ్ హాఫ్ లో సమాధానాలు దొరుకుతాయి. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) నుంచి రెండవ అంకం (సెకండ్ హాఫ్) కి సీన్స్ కలిపిన విధానం. ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది.

ఇక  క్లైమాక్స్ ప్రేక్షకుల  ఊహకు అందకుండా రెండవ పార్ట్ కి (ఫాస్ట్ ఫార్వర్డ్ ) ఇచ్చే లీడ్ ఆసక్తికరంగ ఉంది. టైం ట్రావెల్ చేసి గతాన్ని మార్చాలి అనుకున్న హీరో దాన్ని మార్చ గలిగాడా లేదా అనే విషయాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకుంటేనే ప్రేక్షకులకు థ్రిల్ కలుగుతుంది. .

చివరి మాట:  టైం ట్రావెల్ కన్సెప్ట్ లో క్యూట్ లవ్ స్టొరీ..

18F RATING: 3 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *