ఈనెల 18న సౌత్ ఇండియా లో విడుదలకు సిద్దమైన రివైండ్ మూవీ !

rewind postar e1728994678235

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం లో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

rewind release postar 1

ఈ సందర్భంగా నిర్మాత మరియు దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ : సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు. మేము రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని పాటలు సాఫ్ట్వేర్ వద్దురా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ముఖ్యంగా లవ్ యు నాన్న సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

అన్ని పాటలు మిలియన్ వ్యూస్ తో సినిమా పైన అంచనాలు పెంచాయి. కొత్త కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో మీడియా షోలు వేయడం జరిగింది. చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

rewind release postar

తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్ ని ఎపుడు ప్రోత్సహిస్తారు. మా సినిమా ని కూడా అదే విధంగా ప్రోత్సహించి ఆదరిస్తారని, సినిమాకి పెద్ద విజయం చేకూరుస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :

సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు

టెక్నీషియన్స్ :

నిర్మాణం : క్రాస్ వైర్ క్రియేషన్స్, మ్యూజిక్ : ఆశీర్వాద్, లిరిసిస్ట్ : రవివర్మ ఆకుల, సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్, ఎడిటర్ : తుషార పాలా, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : కళ్యాణ్ చక్రవర్తి, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం, పి ఆర్ ఓ : మధు VR.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *