Raviteja Harish’s 3rd combo RAID titled as Mr.Bacchan:రవితేజ, హరీష్ శంకర్ ల ముడో రైడ్ కి  మిస్టర్ బచ్చన్ గా నామకరణం !

mistar Bacchan poster

మాస్ మహారాజా రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని మరియు అతను హిందీలో అనర్గళంగా మాట్లాడగలడు. అతను తన కొన్ని సినిమాలలో బిగ్ బిని అనుకరిస్తూ కనిపించాడు. అసలు విషయానికి వస్తే, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో నటుడి క్రేజీ ప్రాజెక్ట్‌కు శక్తివంతమైన టైటిల్ వచ్చింది – మిస్టర్ బచ్చన్ మరియు టైటిల్ పోస్టర్ రవితేజ అమితాబ్ బచ్చన్ యొక్క ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లు చూపిస్తుంది.

ఇంకా ఈ రోజు విడుదల చేసిన పొస్తర్ చూస్తే,  రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నాడు. అతని వెనుక, మనం నటరాజ్ థియేటర్ మరియు అమితాబ్ బచ్చన్ చిత్రాన్ని చూడవచ్చు. అతను సినిమా ప్రేమికుడా? సినిమాలో అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని? బిగ్ బి-నామ్ తో సునా హోగా అనే పాపులర్ డైలాగ్ ఈ సినిమా ట్యాగ్ లైన్. తప్పకుండా, టైటిల్ పోస్టర్ మాస్, అభిమానులు మరియు ఇతర అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.

హరీష్ – రవితేజ ల మ్యాజికల్ మాస్ కాంబోలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందిస్తున్నాయి.

ఈ మిస్టర్ బచ్చన్ మూవీ కి  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరుపుకోనుంది.

mistar Bacchan poster 1

ఇప్పటివరకూ దర్శకుడు కానీ, నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ చెప్పక పోయినా పొస్తర్ ఫస్ట్ లుక్ చూస్తుంటే కధ పిరియాడిక్ అనిపిస్తుంది మరియు 2018 హిందీ అజయ్ దేవగన్  ఇలియానా హీరో హీరోయిన్ గా నటించిన రైడ్ చిత్ర కధ అని తెలుస్తుంది.

అప్పటిలో విడుదలైన  రైడ్ సినిమా కి నిర్మాతలుగా  టి సిరీస్ & పనోరమ స్టూడియోస్ ఉన్నారు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమాకి కూడా వారు సమార్పుకులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, హరీష్ -రవితేజ ల కాంబో లో  మూడో సినిమాగా వస్తున్న మిస్టర్ బచ్చన్ హిందీ సినిమా రైడ్ కి రీమేక్ నా లేక అదే సినిమా పాయింట్ తో ఇన్స్పైర్ అయ్యి మొత్తం గా కొత్త  స్క్రీన్ ప్లే రాస్తున్నారా అన్నది తెలియాలి.

గతం లో హరీష్ శంకర్ హిందీ లో హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా ని తెలుగు లో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ గా చేసిన విశయం తెలిసిందే…! కానీ, అఫిసియల్ ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేద్దాము.  ఈ మిస్టర్ బచ్చన్ పొస్తర్ పరిశీలిస్తే రచన – దర్శకత్వం హరీష్ శంకర్ అని వేశారు. కానీ హిందీ సినిమా రైడ్ కి రీమేక్ అయితే ఒరిజినల్ స్క్రిప్ట్ రైటర్ రితేష్ షా పేరు వేయాలి కదా..

 మరి ఈ మిస్టర్ బచ్చన్ కధ కమీసు జిమ్మీక్ ఎంటో  తెలియాలి అంటే వెయిట్ అండ్ వాచ్.

తారాగణం:

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: హరీష్ శంకర్,నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్,సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల,బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,సమర్పకులు: పనోరమా స్టూడియోస్ & టి -సిరీస్,సంగీతం: మిక్కీ జె మేయర్,డిఓపి: అయనంకబోస్, ప్రొడక్షన్డిజైనర్: అవినాష్ కొల్లా,ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి,పిఆర్ ఓ: వంశీ-శేఖర్,మార్కెటింగ్: ఫస్ట్ షో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *