రవితేజ హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ మిరపకాయ్ జులై 11న రీ రిలీజ్ !

IMG 20250621 WA0349

మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

IMG 20250621 WA0351

మిరపకాయ్’ మూవీ రీ-రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం విడుదలై మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది, అదే తరహాలో మిరపకాయ్ సందడి చేయబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *