రవితేజ ధమాకా సినిమా US ప్రీమియర్ షో రివ్యూ బై అమెరికా కుర్రాడు

IMG 20221223 070731

 

రవితేజ ధమాకా సినిమా యుఎస్  ప్రిమియర్స్  రివ్యూ:

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన కొత్త సినిమా ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రవితేజ కామన్ మెన్ అండ్ బిజినెస్ మెన్ గా  డ్యూయల్ రోల్ పోషించడం విశేషం.   రవితేజ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల లీడ్ రోల్ లో  నటించింది.

ఇప్పటికే  సోషల్ మీడియా లో వస్తున్న అన్ని అప్ డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 23) ధమాకా సినిమా తెలుగు వెర్సన్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 22 nd నైట్ నుండి యు ఎస్ లో ప్రిమియర్ షో లు పడ్డాయి

రవితేజ  ధమాకా రిలీజ్ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ హీరోలు ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక యూఎస్ లో ఇప్పటికే ధమాకా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. ట్విట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందనే విషయాన్ని చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు.

ఆ ట్విట్స్ లోనుండి కొన్ని మా అతిది ప్రతినిదులు యు ఎస్ షో చూసి చెప్పిన విశయాలు నుండి మీ కోసం ఈ ఆర్టికల్.

 

ధమాకా పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని సినిమా చూసి  చెబుతున్న ఆడియన్స్.. ఎప్పటిలాగే ఈ సినిమాలో రవితేజ నటనతో ఇరగదీశారని, ఆయనలోని మాస్ ఎనర్జీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిందని అంటున్నారు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు.

బీమ్స్ స్వర పరిచిన పల్సర్ సాంగ్ చాలా బాగా వచ్చిందట.

https://twitter.com/prabhas_fan196/status/1606197986265927680

ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్న ప్రేక్షకులు.. వింటేజ్ మాస్ రవితేజను మరోసారి చూడొచ్చు అని ట్వీట్స్ పెడుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ తగ్గేదే లే అన్నట్లుగా ఉందనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి.

ఇంకా నెటిజన్స్  రవితేజ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని, ఈ జంట చేసిన రొమాంటిక్ సీన్స్ హిలేరియస్ అని చెబుతున్నారు. ధమాకా సినిమాలో కామెడీ సూపర్బ్ అనే ట్వీట్స్ కనిపిస్తుండటం రవి తేజ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

మాస్ కా రాజా  రవి తేజ ఫ్యాన్స్ కి చాలా కాలం తర్వాత ధమాకా సినిమా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని, అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇదనే ఓవరాల్ గా ఊ ఎస్ ప్రేమియార్ చూసిన ప్రేక్షకుల నుండి  టాక్ అయితే వచ్చింది.

ఈ అన్నీ కామెంట్స్ చదివితే మొత్తంగా ధమాకా సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమా రివ్యూస్ ఎలా వస్తాయనేది.

మా 18 f Movies టీం, నా తో పాటూ మార్నింగ్  ప్రసాద్ ఐ-మాక్స్ లొని 8.45 am షో చూడడానికి వెళ్తున్నాము. ధమాకా సినిమా తో పాటూ 18 పేజెస్ సినిమా కూడా ఈ రోజే రిలీజ్ ఉంది కదా ఆ సినిమా కూడా  ప్రసాద్ ఐ-మాక్స్ లొని 11 .45 am షో చూసి రెండు సినిమాల సమీక్షలు 2.00 pm to 4.00 pm మద్యలో పోస్ట్ చేస్తాము.

అప్పటివరకు అవ్వండి చిన్నగా రిలాక్స్. 

మీ కృష్ణ ప్రగడ. 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *