RAvanasura Movie Telugu Review: క్రూరత్వం తో ప్రతీకారం తీర్చుకునే హీరో కధ రవణాసుర  

ravana ౩౩ e1680891581585

మూవీ: రవణాసుర

విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2023

నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, రావు రమేష్, జయరామ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ & ఇతరులు

దర్శకుడు : సుధీర్ వర్మ

నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ

సంగీత దర్శకులు: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: నవీన్ నూలి

ravanasura పొస్తర్ 2

రవణాసుర సినిమా రివ్యూ (Ravanasura Movie Review):

ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో సోలో హిట్ కోసం  మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం “రావణాసుర” తో ఈ వారం థియేటర్స్ లోకి వచ్చేసారు. థ్రిల్లర్ సినిమా కధలను స్టాలిష్ చిత్రాలగా మాలిచే  దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు రాగా మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అనేది మా 18f మూవీ టీం సమీక్షలో చదివి తెలుసుకుందామా !

కధ ను పరిశీలిస్తే (story line):

రవీంద్ర(రవితేజ) కనక మహాలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) అనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ దగ్గర ఓ జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు హారిక (మేఘా ఆకాష్) తన తండ్రి (సంపత్ రాజ్) ని ఓ మర్డర్ కేసులో ఎవరో ఇరికించారు అని. తన తండ్రి నిర్దోషి అని, కనక మహాలక్ష్మి దగ్గరకి వస్తుంది. కానీ హారిక ని చూసిన రవీంద్ర ఆమెని మొదటి చూపు లోనే ఇష్టపడి నట్టు నటుస్తూ పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తాను తీసుకుంటాడు.

ravanasura 3 1

కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు బయట పడుతూ మరికొన్ని హత్యకు జరుగుతాయి.

మరి ఈ మర్డర్స్ చేసింది, చేస్తున్నది  ఎవరు?

ఎందుకు ఇన్ని హత్యకు చేస్తున్నారు? వారి మోటో ఏంటి ?

రవణాసుర కథలో మిగతా హీరోయిన్స్ పాత్రలు ఏంటి?

ఇంతకీ రవీంద్ర హీరో నా ? విలన్ నా ?

సంకేత్ రామ్ పాత్రలో నటించిన సుశాంత్ ఎవరు ?

సంకేత్ రామ్ కి రవీంద్ర కి ఉన్న సంభంధం ఏమిటి ?

ఇన్ని హత్యలు చేసిన కిల్లర్ దొరుకుతాడా ?

అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు  సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే..

ravana 5

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

ఈ చిత్రం మొదటి అంకం (ఫస్టాఫ్) వరకు అంతా మంచి ఆసక్తిగానే సాగుతుంది కానీ సినిమాకి ఎంతో కీలకమైన రెండవ అంకం (సెకండాఫ్) లో మాత్రంకధనం (స్క్రీన్ – ప్లే) ఫ్లో అయ్యి  ఫ్రెష్ నెస్ లేకుండా రొటీన్ ఫార్ములా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం అలాగే పలు సీన్స్ కాస్త క్రూరంగా  ఓవర్ గా కూడా అనిపిస్తాయి.

అలాగే మెయిన్ కథలోకి వెళ్ళాక కూడా ప్లాట్ లో పెద్దగా కొత్తదనం కనిపించదు. దీనితో ముందు బాగున్నా నరేషన్ అంతా దీనితో తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది.

అలాగే ఒక టైం లో అయితే సినిమాలో పాటలు కూడా అంత ఇంపార్టెంట్ అని కూడా అనిపించదు. మరో ముఖ్య పాయింట్ ఏమిటంటే రవితేజ నుంచి కొన్ని కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కోరుకునేవారికి కాస్త నిరాశ తప్పదు ఈ రవణాసుర సినిమా ద్వారా…

ravanasura 34

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

డైరెక్టర్ సుధీర్ వర్మ రాసుకున్న రోల్ కి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఒక పూర్తిగా కొత్త రవితేజ ని ఈ రావణాసురలో మనం విట్నెస్ చెయ్యొచ్చు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రతిభ గానే చెప్పవచ్చు. ఇక కథనంలో కొన్ని ట్విస్ట్ లు మంచి ఆసక్తిగా థ్రిల్ కలిగిస్తాయి. అయితే ఎక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు ఎలా బాలన్స్ చేస్తారు అనే ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు కానీ దర్శకుడు ఈ అంశాన్ని బాగా హ్యాండిల్ చేసి అందరికి సమాన ప్రాధాన్యత కలిగిన సీన్స్ లో చూపించాడు.

రవితేజా నటన పరంగా తనలోకి కొత్త షెడ్ తో  అద్భుతంగా పెర్ఫామ్ చేసి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచాడు. ఈ చిత్రంలో  ఆడియెన్స్ కి బాగా ఆశ్చర్యపరిచే బిగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త ఊహించని క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. ఇక్కడ రాసే కంటే మీరు సినిమా చూస్తే ఇంకా ఎక్సయిట్మెంట్ ఫీల్ అవుతారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే  రవితేజ లో ఇంతకు ముందు చూడని డాన్సర్  ని కూడా చూడొచ్చు.

ఫరియా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్ దక్ష నగర్కార్ అందరికీ ఉన్నంతలో  మంచి రోల్స్ కుదిరాయి వారి పరిధిలో మంచి ఎమోషన్స్ తో కూడిన సీన్స్ లో కనిపిస్తారు.

సుశాంత్ కూడా  సాకేత రామ్  పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్, మురళి శర్మ, విజయ్ కుమార్ ఇంపోర్టెంట్ పాత్రలలో కనిపించి ఆకట్టుకుంటారు.

ravanasura 5

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

 దర్శకుడు సుధీర్ వర్మ  ఇలాంటి థ్రిల్లర్ చిత్రాల కధలను తాను భాగం హ్యాండిల్ చేస్తాడు. అదే విధంగా రావణాసుర లో కూడా చాలా మంచి మంచి థ్రిల్ ని అలాగే ట్విస్ట్ లతో ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేపగలిగాడు. అయితే సినిమా మెయిన్ పాయింట్ ని మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడం వలన  కాస్త నిరాశ కలిగిస్తుంది.

రవణాసుర  చిత్రం రవితేజ టీం వర్క్స్ మరియు  అభిషేక్ పిక్చర్స్  వారు కలిసి నిర్మించడం వలన నిర్మాణ విలువలు అయితే సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ని కూడా చాలా రిచ్ గా మంచి ఆర్ట్ వర్క్ తో నిర్మించారు.

 హర్ష వర్ధన్ రామేశ్వర్ అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. ముఖ్యంగా సినిమాలో టెన్స్ వాతావరణం కి తగ్గ బాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని హైలైట్ చేస్తుంది. రవాణాసుర థీమ్ సాంగ్ లో సౌండ్ కొత్తగా ఇనిపిస్తుంది.  ఐటం సాంగ్ తో  భీమ్స్ ఆకట్టుకొన్నాడు

 విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ  విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే రిచ్ గా పెయింటింగ్ లా ఉన్నాయి.

నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. ఇక కాస్ట్యూమ్స్, డైలాగ్స్ వర్క్ బాగుంది.

శ్రీకాంత్ విస్సా మాటలు బాగానే ఉన్నాయి. కధ మాటలు శ్రీకాంత్ విస్సా అని టైటిల్ లో వేసుకొన్నా ఆ మద్య వచ్చిన బెంగాలీ సినిమా  “విన్సీ దా “ ని పోలి ఉంటుంది ఈ రవణాసుర కధ. చిన్న చిన్న మార్పులతో విన్సీ దా కి ప్రీక్వాల్ గా చేసునట్టు ఉన్నది.

18F మూవీస్ టీం ఒపీనియన్:

ravanasura 6

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రావణాసుర” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ని సరికొత్త నటన తో  ఆకట్టుకుంటాడు. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంది కానీ సుధీర్ వర్మ సినిమా కధనం  విషయంలో కాస్త కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యాల్సింది.

అలాగే సెకండాఫ్  రొటీన్ స్క్రీన్ ప్లే తో ఇది వరకే చూసిన రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఇవి పక్కన పెట్టి ఏ అంచనాలు లేకుండా థ్రిల్లర్  సినిమాలు  చూసే వారికి ఈ రవణాసుర  చిత్రం నచ్చుతుందు.

టాగ్ లైన్: క్రూరత్వం తో ప్రతీకారం తీర్చుకునే హీరో కధ      

18f Movies రేటింగ్: 2.75 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *