Rathnam Movie Telugu Review & Rating: గ్రామీణ పంక్తు మాస్ మసాలా యాక్షన్ డ్రామా !

rathnam Movie Review by 18 fms e1714130520497

చిత్రం: రత్నం 

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2024,

నటీనటులు: విశాల్‌, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు, మురళీ శర్మ తదితరులు.

దర్శకుడు: హరి,

నిర్మాత: కార్తికేయన్ సంతానం,

సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్,

సినిమాటోగ్రఫీ:ఎం. సుకుమార్

ఎడిటింగ్: టీ ఎస్ జయ్, 

మూవీ: రత్నం  రివ్యూ  (Rathnam Movie Review) 

హీరో విశాల్ (Vishal) కథానాయకుడిగా మాస్ గ్రామీణ ఆవతార్ లో నటించిన తాజా సినిమా ‘రత్నం’. దీనికి హరి దర్శకత్వం వహించారు. విశాల్ – హరి కాంబో లో ‘భరణి’, ‘పూజ’ చిత్రాల వచ్చి మంచి విజయాన్ని అందుకున్న తర్వాత వీళ్లిద్దరి కలయికలో మూడో చిత్రంగా తెరకెక్కిన ఈ  రత్నం చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో ప్రత్యేకత.

గ్రామీణ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ రత్నం సినిమా ఈ శుక్ర వారమే తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది.

IMG 20240426 WA0321

 

కధ పరిశీలిస్తే (Story Line): 

రత్నం (హీరో విశాల్) చిన్న తనం లోనే తల్లి – తండ్రులను కోల్పోయి మార్కెట్ లో పన్నీర్ అనే అతని దగ్గర అనూచారుడుగా జీవిస్తుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత  పన్నీర్ స్వామి (సముద్రఖని)  ఎమ్మెల్యే అవ్వడం తో అతనికి ప్రదాన అనుచరుడిగా రత్నం ఉంటాడు. పన్నీర్ స్వామి కోసం ఏం చేయడానికి అయినా రత్నం సిద్ధంగా ఉంటాడు.

మరోవైపు మల్లిక (ప్రియా భవానీ శంకర్) పై కొంతమంది రౌడీలు ఎటాక్ చేస్తారు. ఆమెను చంపడానికి వెంబడిస్తారు. కానీ, వారి నుంచి రత్నం ఆమెను రక్షిస్తూ, రక్షకుడిగా ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ కథ చాలా మలుపులు తిరిగి పెద్ద రక్త పాతం సృష్టిస్తుంది..

అసలు మల్లిక ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు ?,

రత్నం మల్లిక కోసం ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు?,

రత్నం మల్లికా ను ఎందుకు ఇష్ట పడతాడు? 

 మద్యలో లింగం బ్రదర్స్ ఎవరు?, వారి కధ ఏమిటి ? ,

లింగం బ్రదర్స్ కి , మల్లికకు మద్య వైరం ఏమిటి?,

రత్నం ఎంతగానో ఇష్ట పడే తల్లి రంగనాయకి ఎవరు?,

రంగనాయకి ఎలా మరణించింది?,

ఎంఎల్ఏ  పన్నీర్ స్వామి మంచివాడా ? చెడ్డవాడా ?

 చివరకు ఏమైంది? వంటి ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే ఎంటనే దియేటర్ కి వెళ్ళి రత్నం సినిమా చూసేయండి.

IMG 20240426 WA0319

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ ‘రత్నం’ సినిమా కోసం ఎంచుకొన్న కధ పాయింట్ చాలా కొత్తగా ఉన్నా, కధ ని ఇంటరెస్టింగ్ గా నడపవలసిన కధనం (స్క్రీన్ – ప్లే) మాత్రం రొటీన్ రెగ్యులర్ మాస్ ఫార్మెట్ లోనే సాగింది. చాలా సీన్స్  బాగా స్లోగా సాగడం, అలాగే పాత్రల మద్య వచ్చే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం కొంత నిరాశనే.

సినిమా లో మెయిన్ క్యారెక్టర్స్ మద్య రిలేషన్ కూడా సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో విశాల్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే దర్శకుడు హరి టేకింగ్ తో మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) పై ఆసక్తిని  పెంచినప్పటికి మొదటి 20 మినుట్స్ తర్వాత స్లో అవ్వడం,  అదే విధంగా దర్శకుడు రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్  బాగున్నాయి.

  దర్శకుడు హరి తన గత సినిమాల లానే హై హ్యూమన్ ఎమోషన్ తో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టినా, కొన్ని అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ యాక్షన్ స్టోరీలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి.

విశాల్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కొంత మేరకు మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. రెండవ అంకం (సెకండ్ ఆఫ్) మాత్రం చాలా బోరింగ్ గా సాగింది. ఓవరాల్ గా రెగ్యులర్ హరి సినిమా ఫైట్స్ లానే రోటీన్ గా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది.

IMG 20240426 WA0323

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు హరి ఈ ‘రత్నం’ సినిమా కధ ని  కరోనా కి ముందు ఐదు లేదా పదేళ్ల క్రితం తీసి ఉంటే సింగం టైపు లో సూపర్ హిట్ అయ్యేది. ఇప్పటి జనరేశన్ కి ఓటీటీ లో కంటెంట్ ఎక్కువ అవ్వడం వలన, రెగ్యులర్ రొటీన్ ఫార్ములా సినిమాలకి దియేటర్స్ కి రావడం మానేశారు.

ఈ జనరేషన్ ప్రేక్షకులు సినిమాను ఆదరింఛి దియేటర్ వరకూ రావాలి అంటే యాక్షన్ తో పాటు మంచి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి, కధనం కొత్తగా చివరి వరకూ ఊహించని విధంగా సాగాలి.  దర్శకుడు హరి స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ రెగ్యులర్ ఫార్మెట్ లో ఉండడం, ఇప్పటి జనరేశన్ ఫిల్మ్ మేకర్స్ లా అప్డేట్ కాకపోవడం వలన ఈ రత్నం సినిమా అంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు.

కానీ, దర్శకుడు హరి  స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ వాటి కోసం వెళితే వెళ్లవచ్చు. సగటు ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ఫిల్మ్ లో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ పాత్ర, ఆ పాత్రకు హీరోయిన్ పాత్రకు మధ్య లింక్ కొత్తగా ఉంది.

హీరో విశాల్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ కొన్ని పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో విశాల్ చాలా బాగా నటించి మెప్పించాడు.

 హీరోయిన్ గా నటించిన ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

 విలన్ పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనతోనూ మరియు తన బాడీ ఈజ్ తోనూ ఆకట్టుకున్నాడు. మేనరిజం మెయిన్టైం చేస్తూ రౌద్రంగా డైలాగ్స్ చెప్పడం కూడా బాగుంది.

సముద్రఖని నటన కూడా సహజంగా ఉంది. గౌతమ్ మీనన్, యోగి బాబు, ముట్టై రాజేందర్, జయ ప్రకాష్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

IMG 20240426 WA0331

ఈ చిత్రం కోసం నలుగురు యాక్షన్ డైరెక్టర్స్ (కణల్ కణ్ణన్, పీటర్, డీలిప్ సుబ్రమణ్యం, విక్కీ)  డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మాస్ ని బాగా ఆకట్టుకొంటాయి. మాస్ తో కూడిన టేకింగ్ అండ్ యాక్షన్ మేకింగ్ స్టైల్ బాగుంది

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒకే అనిపించేలా ఉంది కానీ, ఆహా అనేలా లేదు. ఏదో తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ మ్యూజిక్ లో కూడా ఉంది.

ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ కధకు తగ్గట్టుగా ఉంది. లొకేషన్స్  అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఫైట్స్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగుంది. కాకపోతే కొన్ని ఛేజ్ షాట్స్ మాత్రం ఫాస్ట్ ఎడిట్ వలన రిజిస్టర్ కాలేదు.

టీ ఎస్ జయ్ ఎడిటింగ్ కూడా ఒకే అనిపించేలా ఉంది కానీ అంతగా బాగాలేదు. రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో వచ్చే సీన్స్ కొన్ని ఎడిట్ చేసి ఉంటే బాగుణ్ణు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఫాస్ట్ కట్స్ వలన కనిపించి కనిపించనట్టు ఉన్నాయి.

ఈ చిత్ర నిర్మాత కార్తికేయన్ సంతానం పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

IMG 20240426 WA0330

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

విశాల్ చాలా రోజులు తర్వాత గ్రామీణ యాక్షన్ డ్రామా చేయాలని గతం లో తనతో మంచి మాస్ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు హరి చెప్పిన ఈ రత్నం కధ పాయింట్ కొత్తగా మరియు ఇప్పటి వరకు లేదా ఈ మద్య కాలం లో తెండితెర మీద చెప్పనిదే అయినా కొంచెం ఎక్కువ రక్త పాతం తో ఎక్కువ యాక్షన్ సీన్స్ తో చూపించడం వలన నార్మల్ ఫ్యామిలీ ఆడియెన్స్ దియేటర్స్ లో నే కాదు టివి లో కూడా చూడడం కష్టం.

ఈ రత్నం సినిమా లో ఎమోషనల్ యాక్షన్ డ్రామా మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథా-కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు లెన్త్ ఎక్కువ అవ్వడం, అలాగే హరి సిన్మా లలోని రెగ్యులర్ రేసి స్క్రీన్ ప్లేలో వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా అనిపిస్తాయి.

ఓవరాల్ గా విశాల్, సముద్రఖని, యోగీబాబు, మురళి శర్మ, ప్రియ భవానీ శంకర్ ల   నటన ఆకట్టుకున్నా, ఈ రత్నం సినిమా మాత్రం రూరల్, మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టు కోవచ్చు. రెగ్యులర్ సినిమా ప్రేక్షకులకు, సిటీ వీవెర్స మాత్రం నచ్చకపోవచ్చు.

IMG 20240426 WA0148

చివరి మాట: రక్త పాతం సృష్టించిన రత్నం !

18F RATING: 2.5  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *