చిత్రం: రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ !
విడుదల తేదీ : 24 – 01 – 2025,
కథ: యుగో సాకో,
దర్శకత్వం: కైచీ ససాకీ, రామ్మోహన్,
నిర్మాత: అర్జున్ అగర్వాల్,
క్రియేటివ్ పార్ట్‌నర్: వీ విజయేంద్ర ప్రసాద్,
బ్యానర్స్: గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్,
మూవీ:రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రివ్యూ (Ramayana Movie Review)
సుమారు 35 సంవత్సరాల క్రితం జపనీస్ యానిమే స్టైల్ లో ఇండో – జపనీస్ యనిమెసన్ అండ్ మూవీ ప్రొడక్షన్ సంస్థలు వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుని ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ‘ పేరున రామాయణాన్ని పిల్లలకు పెద్దలకు దృశ్య కావ్యంగా యని మేటెడ్ చిత్ర రూపంలో తెరకు ఎక్కించడం జరిగింది. జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి అలాగే భారతదేశానికి చెందిన రామ్ మోహన్ కలిసి ఈ చిత్రాన్ని జడకెక్కించడం జరిగింది.
అయితే 31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలయి ప్రేక్షకుల మన్ననలను పొందినా కొన్ని కారణాలవల్ల భారతదేశంలో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏ ఏ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా భారతదేశంలో సినీ ప్రేక్షకుల కోసం జనవరి 24వ తేదీన అనగా ఈ శుక్ర వారం తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయడం జరిగింది. మరి ఈ రామాయణ ఎలా ఉందో, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మా 18F మూవీస్ సమీక్ష చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
ఈ చిత్ర కధ లోకి వెళ్తే శ్రీరాముడికి సుమారు 15 సంవత్సరాల వయసు నుండి మొదలై రామ రావణుల యుద్ధం తరువాత పట్టాభిషేకం వరకు మధ్య జరిగిన రామాయనం లొని ముఖ్య ఘట్టాలను తీసుకొని చిత్రీకరించారు.
శ్రీరాముడు శివధనస్సును విరవడం, సీతను పెళ్లి చేసుకోవడం, కైకేయి కు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మాట నిలబెట్టేందుకు శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లడం, దశరథ మహారాజు మరణించడం, భరతుడు రాముడు కోసం అడవికి వెళ్లడం, లక్ష్మణుడు సూర్పనక ముక్కు కోయడం, రావణుడు సీతను అపహరించడం వంటి ఘటనలు మొదటి అంకం లో పొంది పరిచారు.
ఇక రెండవ అంకం ( సెకండ్ ఆఫ్ ) లో రాముడు హనుమంతుడిని కలవడం, సుగ్రీవ వానర సైన్యంతో కలిసి రాముడు అప్పటికే సీత లంకలో ఉంది అని హనుమంతుడు ద్వారా తెలుసుకుని సీత తో పాటు లంకలో బంధిగా ఉన్న సామాన్య ప్రజలకు కూడా విముక్తి కల్పించాలనే వ్యూహ రచన తో పాటు, హనుమంతుడు లంక దహనం తర్వాత లంకపై యుద్ధానికి వెళ్లడం, రామ రావణ యుద్ధంలో రాముడు రావణుడిని పలమార్చిన తర్వాత అయోధ్యకు తిరిగి రావడం వరకు ఈ చిత్ర కధ సాగింది.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
భారత ప్రజలకు, ఇందు సంస్కృతి ని యిస్థపడే ప్రపంచంలొని వివిద దేశాల ప్రజలకు వాల్మీకి రామాయణం అందరికీ తెలిసిందే. అయితే అదే రామాయణాన్ని ఆధారం చేసుకుని జపాన్ యానిమే స్టైల్ లో ఈ యనిమేటెడ్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.
భారత దేశం లో సాధారణంగా ఎన్నో సినిమాలు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినప్పటికీ ప్రేక్షకులు ప్రతి సినిమాలు ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. అయితే ఈ సినిమా జపనీస్ యానిమే స్టైల్లో రావడం విశేషంగా చెప్పుకోవాలి. సుమారు 1993లో ఈ చిత్రం రూపొందించడం జరిగింది.
అయితే ఆ రోజుల్లోనే ఇంత మంచి యానిమే గ్రాఫిక్స్ చేయడం గొప్ప విషయం అని చెప్పకూడదు. గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా నిజమైన రూపొందించడం ఎంతో కష్టమైనప్పటికీ చాలా బాగా తీయడం జరిగింది. అయితే నిర్మాణ విలువలలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం స్క్రీన్ లకు అలాగే ప్రేక్షకులకు తగ్గట్లు 4Kలో విడుదల చేయడం మరో విశేషం
దర్శకులు, పాత్రల రూపకల్పన పరిశీలిస్తే:
జపాన్ కు చెందిన యుగో సాకి వాల్మీకి రామాయణం ఆధారంగా కధ రాయగా, కోయిచి ససకి, రామ్మోహన్ కలిసి ఆ కధ కు తగ్గ స్క్రీన్ ప్లే రాసుకొని చక్కగా 30 సంవత్శరాల క్రితమే ఎంతో డబ్బు సమయం వెచ్చించి ప్రపంచ మేలి చిత్ర కారుల ( యనిమెటర్స్ ) సహకారంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ యని మేటెడ్ చిత్రం కాబట్టి పాత్రల రూప కల్పన, స్క్రీన్ మీద నటన మొత్తం యని మెసన్ టీంకె దక్కుతుంది.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ముఖ్యంగా సాంకేతిక అంశాలు గురించి మాట్లాడుకొంటే, సన్నివేశాలకు తగ్గ సంగీతాన్ని అందించడం జరిగింది. సీన్స్ ఎడిటింగ్ కూడా బాగుంది.
రాముడు, సీత ,లక్ష్మణుడు, హనుమాన్, రావణుడు వంటి ముఖ్య పాత్రలకు కొంచెం పేరుమోసిన ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పి ఉంటే ఇంక చాలా మంది ప్రేక్షకులకు చేరువయ్యేది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
తెలుగు వారికి పప్పు అవకాయి ఎన్ని సార్లు తిన్నా తినలనిపిస్తుంది. అలానే మన భారతీయులకు రామాయణం, మహా భారత్ ఎన్ని సార్లు చూసినా మరలా చూడాలని పిస్తుంది. అలాగే సినీ ప్రేక్షకులు తెలిసిన రామాయణాన్ని ఎన్ని సార్లు చూసినా మరలా మరలా చూస్తూ ఆనందపడతారు.
అలాంటి రామాయనాన్ని దృశ్య కావ్యంగా చూడాలి అనుకొనే వారి కోసం మనకు తెలిసిన రామాయణా మరింత అద్భుతమైన ఎఫ్ఫెక్ట్స్ తో బొమ్మల చిత్రంగా తీర్చి దిద్ది, నేటి కంప్యూటర్ యుగం లొని పిల్లలు ఇష్టపడే యనిమెసన్ పాత్రలలో చూసే విధంగా ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ రూపొందించడం జరిగింది.
ఇప్పటి జనరేశం పిల్లలకు, హిందూ సంస్కృతి ని, శ్రీరామున్నీ ప్రేమించే ప్రతి కుటుంబ తప్పక చూడవలసిన చిత్రంగా ఈ రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రూపొందించడం జరిగింది.