Ramanna Youth Pre release update: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అతిథిగా ఈ నెల 11న “రామన్న యూత్” ప్రీ రిలీజ్ ఈవెంట్ !

IMG 20230908 WA00831 e1694183471182

 

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది.

IMG 20230906 WA0079

ఈ నెల 11న సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఫంక్షన్ కు అతిథిగా హాజరుకానున్నారు.

IMG 20230905 WA0175

“రామన్న యూత్” సినిమా నుంచి రీసెంట్ గా హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బలగం వంటి సహజమైన మన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “రామన్న యూత్” సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 15న “రామన్న యూత్” సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

IMG 20230907 WA0017

నటీనటులు :

అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.

సాంకేతిక నిపుణులు :

కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి

సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి

ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్

ఆర్ట్ – లక్ష్మీ సింధూజ

సంగీతం – కమ్రాన్

సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే

పీఆర్వో – జీఎస్ కే మీడియా

రచన దర్శకత్వం – అభయ్ నవీన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *