“Rama Ayodya” Documentary Streamin on AHA OTT : శ్రీరామనవమి నాడు ఆహా ఓటిటి లో “రామ అయోధ్య” డాక్యుమెంటరీ ఫిల్మ్ !

IMG 20240415 WA0019

శ్రీరాముడి 16 సద్గుణములపై మొత్తంగా అయోధ్య లో తీసిన “రామఅయోధ్య” అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ శ్రీరామ నవమి నాడు తెలుగు ఓటిటి “ఆహా” లో రిలీజ్ కాబోతుంది. ఈ ఫిల్మ్ కి నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత -సత్యకాశీ భార్గవ కధ, కధనం అందించగా, కృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ సందర్బంగా రచయిత సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ:- రామఅయోధ్య లో శ్రీరాముడి ముఖ్యగుణముల ను చెబుతూ, అయోధ్య లోని అనేక ముఖ్య ప్రదేశాలను చూపిస్తూ , వాటి విశేషాలను చెప్పడం జరిగింది. ఇది తెలుగు వారికి అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.

దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ:- అయోధ్య అంటే రామమందిరం మాత్రమే కాదు, అనేక పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. అవన్నీ మా ఫిల్మ్ లో చాలా బాగా చూపించాము. అంతేకాకుండా శ్రీరాముడి యొక్క గుణములను మనము ప్రస్తుతకాలంలో ఆచరించడం ఎలాగో మేము సింపుల్ గా అందరికీ అర్థం అయ్యేలా తెరకెక్కించాము అని అన్నారు.

ఈ ఫిల్మ్ టెక్నీషియన్స్:

బ్యానర్స్ -భార్గవ పిక్చర్స్ & దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ , ప్రొడ్యూసర్స్ -సత్యకాశీ భార్గవ , భారవి కొడవంటి , మ్యూజిక్ -వందన మజాన్ , కెమెరా -శైలేంద్ర , ఎడిటింగ్-యాదగిరి-వికాస్ , రచన -సత్యకాశీ భార్గవ , దర్శకుడు -కృష్ణ S రామ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *