RAM  Movie Streaming on Amazon: అమెజాన్‌లో ఆకట్టుకుంటోన్న రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సినిమా! 

IMG 20240326 WA0123 e1711456651345

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అంటూ దేశభక్తిని చాటే చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా ఈ చిత్రంతో తన సత్తా చాటుకున్నారు.

IMG 20240326 WA0124

మొదటి సినిమానే అయినా అటు హీరోకి, ఇటు దర్శకుడికి రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మంచి పేరుని తీసుకొచ్చింది. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ భక్తిని చాటే చిత్రమే అయినా అన్ని రకాల అంశాలను, ఎమోషన్స్‌ను కలగలిపి తీయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యూజిక్, ఆర్ఆర్, కెమెరావర్క్ ఇలా అన్ని క్రాఫ్ట్‌లకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్‌లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లో మిస్ అయిన వారంతా ఈ దేశ భక్తి సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *