Ram Charan in Mumbai: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

IMG 20231004 WA0058 e1696412618664

 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే.

IMG 20231004 WA0056

ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.

IMG 20231004 WA0061

 

అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంత నిష్టగా ఉంటారో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ సమయంలో రామ చరణ్ కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు.

IMG 20231004 WA0057

 

సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అభిమానులను ఆకర్షించింది. వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే సిద్ధి వినాయకుని ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయంలో రామ్ చరణ్ తన దీక్షను విరమించటం అందరి దృష్టిని ఆకర్షించింది.

IMG 20231004 WA0059

రామ్ చరణ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ దీక్షను చేస్తుంటారు. ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్ష చేయటాన్ని విడిచి పెట్టలేదు. ఈ ఏడాది ఆయన కుమార్తె క్లీంకార రాకతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఓ వైపు వృతిపరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను బ్యాలెన్స్ చేయటంలో రామ్ చరణ్ తన అంకిత భావాన్ని ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *