Rakshasa Kavyam” release date Changed:  అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమైన “రాక్షస కావ్యం” !

RAKSHASHA KAVYAM POSTER e1696079298309

అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత క్వాలిటీ కోసమే వారం రోజులు “రాక్షస కావ్యం” మూవీ రిలీజ్ ను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ తెలిపారు.

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు.

RAKSHASHA KAVYAM 1

రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు ఇన్ స్టంట్ హిట్ అయ్యాయి.

ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాళ్టి ట్రెండ్ కు కావాల్సిన సినిమా అంటూ అప్రిషియేట్ చేశారు. ఈ అంచనాలన్నీ అక్టోబర్ 13న థియేటర్స్ లో రీచ్ అవుతామని మూవీ టీమ్ నమ్మకంతో చెబుతున్నారు.

RAKSHASHA KAVYAM 2

నటీనటులు :

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు

టెక్నికల్ టీమ్: 
ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకట్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
సాహిత్యం – మిట్టపల్లి సురేందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
రచన, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *