సూపర్ స్టార్ రజనీకాంత్ తలతిప్పినా, కాలు కదిపినా సంచలనమే.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి, ఆయన డైలాగ్స్‌కి ఫిదా అవ్వని వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన నడిచినా.. కాలర్ ఎగరేసినా.. కూర్చున్నా.. సిగరేట్ కాల్చినా ప్రతిదీ స్టైల్ గా ఉంటుంది.
తనవైన మేనరిజంతోనే తన రూటే సెపరేట్ అంటూ ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని తమిళ తంబీలు చేత ముద్దుగా పిలిపించుకొనే తలైవర్..తమిళ్ సూపర్ స్టారే కాదు.. పాన్ ఇండియా స్టార్, అనేక దేశాలలో ఇండియన్స్ తో పాటు ఇతరులను కూడా తన స్టైల్ తో మెస్మరైజ్ చేసి ఇప్పటికీ సూపర్ స్టార్ స్టేటస్ తో సంచలన సినిమాలు చేస్తున్న రజనీ నేడు 72 వ పుట్టినరోజు.
నిజానికి రెండు మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చిన వారిలో రజనీకాంత్ ముందు ఉంటారు . సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాకపోయినా సౌత్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు రజనీకాంత్.
తన స్టైల్ తో, మేనరిజమ్స్ తో అప్పటికి ఇప్పటికీ బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని నార్త్ లో కూడా సౌత్ సత్తా చూపించారు సూపర్ స్టార్ రజనీకాంత్.
తలైవర్ స్టైల్ గా సిగరెట్ కాల్చే ఒక్క సీన్ తోనే కోట్ల మంది ప్రేక్షకులు ఆయనకు డై హార్డ్ ఫాన్స్ అయిపోయారు. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళంతా ఆయనలా ఒక్కసారన్నా కచ్చితంగా ట్రై చేసే ఉంటారు. 72 ఏళ్లవయసులో ఉన్నా ఇంకా 40 ఏళ్లే ఉన్నట్టు కనిపించడం ఆయనకే సాధ్యం.
ప్రస్తుత వయుస్సు లో లేస్తే కూర్చో లేరు చాలా మంది, కానీ రజినీ మాత్రం విలన్లతో ఫైట్లు, హీరోయిన్లతో డ్యూయెట్లు, పోటీపడి డ్యాన్సులు చెయ్యడం ఎంతో ఈజీ అంటూ చేస్తారు. 72 సంవత్సరాల వయస్సు లో నార్మల్ జనానికైతే ఇది చాలా కష్టమేమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మాత్రం కాదంటారు ఫ్యాన్స్.
అందుకే 72 ఏళ్ల వయసులో కూడా జైలర్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రజనీ. సౌత్ సూపర్ స్టార్.. తమిళ్ తలైవా.. స్టైల్ ఐకాన్.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే.
ఇప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటినా, 72 ఏళ్ల వయసులో ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత ఇమేజ్ రజనీకాంత్ కి ఉంది. ఫస్ట్ సౌత్ హీరో అయినా కానీ రజనీకాంత్ కి సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా మంచి మాస్ ఇమేజ్ కూడా ఉంది.
ఈ ఎనర్జీ తోనే ఇండియా వైడ్ ఫాన్స్ కి ఇంకా ఫేవరెట్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు.
ఈ భాషా ఒక్క సారీ చెప్తే వంద సార్లు చెప్పినట్టే..
ఆ అరుణాచలం ఆదేశిస్తే.. ఈ అరుణాచలం ఆచారిస్తాడు..
నా రూటే సెపరేట్ అంటూ పంచ్ డైలాగ్స్ రజినీ నోట వింటే థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ మారుమోగుతాయి. ఇలాంటి డైలాగ్ డెలివరీ, స్టయిలిష్ నటన ఇండియన్ స్క్రీన్‌పై మరెవ్వరికీ సాధ్యం కాదు, ఒక్కరజనీకాంత్ కి తప్ప.
72ఏళ్ల వయసొచ్చినా ఆయన ఇప్పటికీ ఇండియన్ సూపర్ స్టారే.
అదే స్టైల్, అదే మాస్ అప్పీయరెన్స్ తో అదరగొడుతోన్న రజనీకాంత్ స్క్రీన్ మీద ఇంకా ఎవర్ యంగ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే ఉంటారు. ఇంకా అదే స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ జైలర్ తో బిజీగా ఉన్న రజనీ లేటెస్ట్ గా మరో 2 సినిమాల్ని అనౌన్స్ చేశారు.
సౌత్ ఇండియన్ సినిమా నటులలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ రజనీకాంత్. టోటల్ సినిమా ఖర్చు కంటే రజనీ రెమ్యూనరేషన్ కే ఎక్కువ ఖర్చవుతుంది .అయినా సరే రజనీని ప్రొడ్యూసర్లు తీస్కుంటున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్దం చేస్కోవచ్చు. గత కొన్నేళ్లుగా తమిళ్ లోనే అత్యధిక ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీ కూడా రజినీకాంతే.
72 ఏళ్ల ఈ సూపర్ స్టార్ స్టిల్ ఇంకా కాలేజ్ స్టూడెంటే.
రజినీ డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఈ వయసులో కూడా ఏ విషయమైనా నేర్చుకోడానికి ముందుంటారు. శరీరం సరిగా సహకరించకపోయినా సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ నేర్చుకుంటారు.
రోబో సినిమాకు ఎక్స్ ట్రా మేకప్ అవసరం అయినా, శివాజీ సినిమాలో డిఫరెంట్ గా కనిపించినా.. ఇలా సినిమా మేకింగ్ కు ఎంత టైమ్ పట్టినా ఓపికగా ఉంటారు, అనుకొన్న టైమ్ కి సినిమా ఫినిష్ చేస్తారు రజనీ.
అందుకే రజినీకాంత్ హీరోగా, స్టార్ గా ఎదిగి కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నారు. అయన స్టైల్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఏజ్ పెరిగినా ఆయన స్టైల్ మాత్రం మారదు.
నేడు (12.12.2022) రజిని పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో మనందరిని తన స్టైల్ లో ఎంటర్టైన్ చేయడానికి రజినీకాంత్ జైలర్ సినిమాతో రానున్నారు. దాని తర్వాత లాల్ సలాం అంటూ సినీ ప్రేక్షకులను పాలకరిస్తారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ జరుగుతుంది.
మనమందరం ఆ దేవుణ్ణి కోరుకొనేది ఒక్కటే, తలైవర్ నుండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ మనలను సినిమా ద్వారా ఆనందింప చేయాలని కోరుకొందాము.
మరొక్క సారీ.. హ్యాపీ బర్త్డే తలైవర్..
photo curtesy: Twitter & Rajini Fan clubs.
* కృష్ణ ప్రగడ.