రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన శాసనసభ సినిమా సక్సెస్ మీట్ నీ ఈ రొజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం భాదగా, ఎమోషనల్ గా అంతే కామెడీగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఎవడైనా, ఎంత దైర్యం ఉంటే మాత్రం అవతార్ 2 సినిమా మీద మారో సినిమా విడుదల చేస్తారా?. తెలుగు ప్రజలతో పాటూ, ప్రపంచం అంతా అవతార్ 2 గురించి మాట్లాడుకుంటుంటే మా నిర్మాతలు మా శాసనసభ సినిమా లోని కంటెంట్ మిద నమ్మకం తొ దైర్యంగా అవతార్ 2 తో పాటూ మా సినిమా విడుదల చేశారు.
మా అదృష్టం బాగుండి, తెలుగు ప్రజలకు మ శాసనసభ సినిమా నచ్చి హిట్ చేసారు…
పర్సన్ టూ పర్సన్ మౌత్ టాక్ పేరికి నేటినుంచి (మండే) తెలుగు రాష్ట్రాలలో ఇంకో 60 థియేటర్స్ లో శాసనసభ సినిమా ప్రదర్శన చేస్తున్నారు..
తెలుగు ప్రజలు అందరూ రాజకీయాలు తో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి, మా సినిమా వారికి బాగా నచ్చి ఉంటాది. మా శాసనసభ సినిమాకి కదా మాటలు రాసిన రాఘవేంద్ర రెడ్డీ ఇంతకు ముందు పొలిటికల్ జర్నలిస్టు గా చేసాడు కాబట్టి మా సినిమా లో మాటలు అంత బాగా నట్యూరాల్ గా ఉన్నాయి..
మీ మీడియా కూడా మా శాసనసభ సినిమా గురించి అందులోని పాత్రలు, వాటి మాటలు మి మీ పత్రికలలో, ఛానెల్స్ లో డిస్కస్ చేస్తూ ఆడియన్స్ కి మా శాసనసభ సినిమా ఉంది ఆని చెప్పండి అంటూ ముగించారు రాజేంద్రప్రసాద్ గారు.