Raj Kandukuri Unveils Poster of Bhavani Ward 1997 Movie : రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘భవానీ వార్డ్ 1997’ పోస్టర్ విడుదల!

IMG 20240111 WA0121 e1704972688509

 

చిన్న చిత్రాలు, పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. రకరకాల జానర్లలో తీసే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ‘భవానీ వార్డ్ 1997’ అనే చిత్రం రాబోతోంది.

చంద్రకాంత సోలంకి శివ దోశకాయల గారితో కలిసి విభూ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు.

IMG 20240111 WA0122

ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. పోస్టర్ బాగుందని ప్రశంసించారు. ఇక ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ సైతం సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ మూవీకి అరవింద్ బి కెమెరామెన్‌గా పని చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.

 

నటీనటులు :

గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్ : విభూ ప్రొడక్షన్స్, నిర్మాత : చంద్రకాంత సోలంకి దర్శకుడు : జీడీ నరసింహా, కెమెరామెన్ : అరవింద్. బి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *