Rahul Sipligunj Clarification on Political entry: రాజకీయా రూమర్స్ పై వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ !

IMG 20230826 WA0058

 

గత కొన్ని రోజులుగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ పై స్వయంగా రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ప్రతి ఒక్కరికి ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎలాంటి రాజకీయాల్లోకి వెళ్లడం లేదు.

IMG 20230826 WA0085

గోషామహల్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే గా పోటీ చేయబోతున్నట్లు రూమర్లు వస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలు అన్నీ ఫేక్. ఎలాంటి వాస్తవం లేదు.

నేను అన్ని పార్టీల రాజకీయ నాయకులని గౌరవిస్తాను. నేను  ఆర్టిస్ట్ ని, వినోదం అందించడమే నా పని. నేను జీవితాంతం ఆర్టిస్ట్ గానే ఉంటాను. అన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో నా గురించి ఈ ఫేక్ న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయో అర్థం కావడం లేదు.

IMG 20230826 WA0086

సంగీతంలోనే నా కెరీర్ కొనసాగిస్తాను. ఇండస్ట్రీలో నేను చేయాల్సి పని చాలా ఉంది. ఏ పార్టీ నుంచి రాజకీయ నాయకులు నన్ను కలవడం కానీ.. నేను వారిని కలవడం కానీ జరగలేదు.  ఇలాంటి రూమర్స్  సృష్టించడం ఆపండి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన గురించి వస్తున్న రాజకీయా రూమర్స్ పై వివరణ ఇచ్చారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *