Radha Madhavam ‘s Romantic Song Out: రాధా మాధవం’ నుంచి ‘నువ్వు నేను’ పాట విడుదల !

IMG 20231225 WA0129 e1703506610108

 

గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది. అలాంటి సహజత్వం ఉట్టి పడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.

ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతే కాకుండా బిగ్ బాస్ సోహెల్ రీసెంట్‌గా ‘నేల మీద నేను ఉన్నా’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేయగా శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘నువ్వు నేను’ అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి.జీ ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.

త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

నటీనటులు :

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు

 

సాంకేతిక బృందం: 

నిర్మాత : గోనాల్ వెంకటేష్,స్క్రీన్ ప్లే దర్శకత్వం :దాసరి ఇస్సాకు ,కథ మాటలు పాటలు : వసంత్ వెంకట్బాలా,సంగీతం : చైతు కొల్లి,కెమెరామెన్ : తాజ్ జీడీకే,ఎడిటర్ : కే రమేష్,ఫైట్స్ : రాబిన్ సుబ్బు,పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *