Radha Madhavam Movie Song Launch: రాధా మాధవం’ నుంచి ‘నేల మీద నేను ఉన్నా’ పాట విడుదల

IMG 20231213 WA00911 e1702473431180

 

విలేజ్ లవ్ స్టోరీలు వెండితెరపై ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఎన్ని జానర్లలో ఎన్ని కొత్త చిత్రాలు వచ్చినా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథా చిత్రాలపై ఆడియెన్స్ ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.

IMG 20231213 WA00931

ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. అలానే ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు.

IMG 20231213 WA01011

తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సోహెల్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ‘నేల మీద నేను ఉన్నా’ అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీ బాగుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

నటీనటులు :

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు

 

 

సాంకేతిక బృందం : 
నిర్మాత : గోనాల్ వెంకటేష్,స్క్రీన్ ప్లే దర్శకత్వం :దాసరి ఇస్సాకు, కథ మాటలు పాటలు : వసంత్ వెంకట్ బాలాసంగీతం : చైతు కొల్లి,కెమెరామెన్ : తాజ్ జీడీకే,
ఎడిటర్ : కే రమేష్,,ఫైట్స్ : రాబిన్ సుబ్బు,పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *