Radha Madhavam Movie First Look: రాధా మాధవం’ పోస్టర్‌ను విడుదల చేసిన డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు !

IMG 20231202 WA0129 e1701509605721

 

విలేజ్ లవ్ స్టోరీలు వెండితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల అండ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.

ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే.

IMG 20231202 WA0130

తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు :

 

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు

సాంకేతిక బృందం: 

నిర్మాత : గోనాల్ వెంకటేష్, స్క్రీన్ ప్లే దర్శకత్వం :దాసరి ఇస్సాకు ,కథ మాటలు పాటలు : వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, కెమెరామెన్ : తాజ్ జీడీకే, ఎడిటర్ : కే రమేష్,ఫైట్స్ : రాబిన్ సుబ్బు, పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *