ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ బ్రిలియంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది.
మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది.
ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు కూడా ఎంతో వేగంగా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి అపారమైన రెస్పాన్స్ రావడం జరిగింది.
కాగా ఇప్పుడు హైదరాబాదులో ఈ చిత్ర ఈవెంట్ జరుగుతుండగా ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈవెంట్ కు బలగంగా నిలవడం జరిగింది.
ఈ సందర్భంగా పుష్ప వైల్డ్ ఫైర్ జాతరలో కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నేను ఈ చిత్రంలో రెండు పాటలకు ఒక స్టెప్స్ తో కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సినిమా ఎంతో అద్భుతంగా రావడం జరిగింది.
సుకుమార్ గారు సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఎంతో పర్టికులర్గా ఉన్నారు. బన్నీ గారు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. సుమారు సంవత్సరం పాటు వీరితో ట్రావెల్ చేయడం జరిగింది. వారి డెడికేషన్ కు నేను ఫిదా అయిపోయాను. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో కలుద్దాం” అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనిక మాట్లాడుతూ… “ఈ చిత్రంలో పనిచేసిన అందరికీ ఈ 5 ఏళ్లు జీవితంలో మంచి జర్నీగా గుర్తుండిపోతుంది. చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ మా ధన్యవాదాలు” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కుబా బ్రోజెక్ మాట్లాడుతూ… “ఈ చిత్రంలో ఇంతటి స్టార్స్ తో పని చేయడం నాకు ఇంత సంతోషంగా ఉంది. ఇక్కడ నేను మరిన్ని గొప్ప విజువల్స్ తీసేందుకు వీలుగా ఉంది.
ఈ చిత్రంలో పనిచేసేందుకు నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్ కు నా ధన్యవాదాలు. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం అల్లు అర్జున్, సుకుమార్ లాంటి వాడు మాత్రమే ఎటువంటి అద్భుతమైన చిత్రాలను తీయగలరు అనిపిస్తుంది” అన్నాను.