పుష్ప 2 : ది రూల్” తొలిరోజు ఇన్ని వందల కొట్లా?

IMG 20241206 WA02501 e1733493927793

  బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన పుష్ప 2 సినిమా నేడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. భారతదేశ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ కలెక్షన్స్ తో మరో కొత్త రికార్డు సృష్టించింది.

ఇప్పటికీ 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 233 కోట్లు కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఈ రికార్డును మార్చివేసింది. మొదటి రోజే 294 గ్రాస్ కలెక్షన్స్ తో కొత్త రికార్డు సృష్టించింది. గత రికార్డులు అన్నింటినీ తిరగరాస్తూ సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాగా నిలిచింది.

నైజంలో ఆర్ఆర్ఆర్ చిత్రం మొదటి రోజు 23 కోట్లు కలెక్ట్ చేయగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజాం రికార్డు కూడా తిరగరాస్తూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

అదేవిధంగా హిందీలో ఎన్నడూ లేని విధంగా టాప్ సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి రోజు 72 కోట్ల కలెక్షన్స్ తో హిందీ సినిమా చరిత్ర లోనే నూతన రికార్డ్ క్రియేట్ చేసింది..డే వన్ రికార్డులో అల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది.

పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, తెలుగువారి కీర్తి కూడా పెంచే స్థాయిలో భారీ బ్లాక్ బుస్టర్ హిట్ కొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *