శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకాలాజికల్ థ్రిల్లర్ చిత్రం ప్రారంభం

SAVE 20221218 185452

కె. యస్. ఆర్ ప్రజెంట్స్ ఉదయ్ & రవి క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా , హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా , కమల్ కామరాజు, అజయ్ ఇతర పాత్రల్లో డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డి లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానయుడు స్టూడియో లో ఘనంగా జరుపుకుంది.

ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు డాక్టర్ రవికిరణ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

SAVE 20221218 185504

చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ...

ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. Post traumatic stress disorder (పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్) కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

SAVE 20221218 185445

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ…

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం “థ రాంగ్ స్వైప్” చాలా బాగుంది,

అలాగే ఈ చిత్ర కథ విని వెంటనే చెన్నయ్ పిలిచి కథను ఒకే చేశాను, యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలిపారు.

SAVE 20221218 185458

కమల్ కామరాజు మాట్లాడుతూ…

ఈ సినిమా విజువల్స్ బాగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ గాడలె గారు కథ ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉండబోతొంది. నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ లో నేను ఈ సినిమాలో నటించబోతున్నాను అన్నారు.

హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ…

ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు చెప్పిన కథ బాగుంది. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

నటీనటులు:

శ్రీకాంత్ శ్రీరామ్, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు, అజయ్, తదితరులు.

సాంకేతిక నిపుణులు: 

బ్యానర్: ఉదయ్ & రవి క్రియేషన్స్

నిర్మాతలు: డాక్టర్ ఉదయ్ కె రెడ్డి పాల్వాయ్

డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ రవికిరణ్ గాడలె

కెమెరామెన్: స్కై (SKY)

ఆర్ట్ డైరెక్టర్: రాజు అడ్డాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నితిన్ కుమార్. ఆర్

అసోసియేట్ రైటర్: ఎస్.వి.త్రివీర రెడ్డి

కో. డైరెక్టర్: మధుసూదన్ రెడ్డి. ఏ

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వోరంపాటి కృష్ణారెడ్డి

కాస్ట్యూమ్స్: పరమేశ్వర రామకృష్ణ

డైరెక్షన్ టీమ్: ఎస్.ఎమ్.వి.ఆదోని, శ్రీకాంత్ రెడ్డి. టి, రామకృష్ణ. బి.

చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఆర్యన్

పీఆర్ఒ: శ్రీధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *