కేవీ అనుదీప్ ‘పిట్టగోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తన రెండవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
అదే ‘ ‘జాతి రత్నాలు’ సినిమా. రీసెంట్ గా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో చేసిన ‘ప్రిన్స్’ సినిమాకి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది.
కానీ ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుదీప్ తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు.
తాను హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఈ వ్యాధి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా పట్టించుకోరు.
అంతేకాదు తనకు గ్లూటెన్ పడదనీ.. ఎప్పుడైనా కాఫీ తాగితే మాత్రం రెండు రోజుల వరకు నిద్ర పట్టదనీ.. చెప్తూ ఏదైనా జ్యూస్ తాగితే తన మైండ్ కామ్ అవుతుంది కూడా చెప్పాడు.
ఒక్కోసారి ఆ సమయంలో ఏం చేస్తానో కూడా తెలియదు అని చెప్పాడు. ఇక ఈ వ్యాధి ఉన్నవారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని.. ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన నేను తట్టుకోలేను.
అలాగే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు త్వరగా అలిసిపోతారు. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ ఉంటాను అని తెలిపారు.
కానీ ఎప్పటికైనా ఈ వ్యాధి పై త్వరలో ఒక సినిమా చేయాలని ఉందని అనుదీప్ చెప్పాడు.