భీమవరం టాకీస్ బ్యానర్లో 119 వ సినిమాగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాతగా.. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కె.పి.హెచ్.బి. కాలనీలో”. ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో క్లాప్ కొట్టి మొదటి షెడ్యూల్ షూటింగ్ పోలీసు అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ… అంతర్లీనంగా ఒక సందేశాన్ని ఇస్తూ చాలా రిచ్ గా ఈ సినిమా థీస్తున్నాం. ఆ గణపతి దేవుడు దగ్గర పూజ అనంతరం మా సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ మొదల వుతున్నాయి” అన్నారు.

డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. సి.ఐ తుమ్మ గోపిగారు 10 సంవత్సరాల క్రితం నా షార్ట్ ఫిల్మ్ కి క్లాప్ కొట్టారు.
మరల ఇప్పుడు నా సినిమాకి క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రణయ్ రాజ్, రాము, వరుణ్ వద్దేటి తదితరులు పాల్గొన్నారు.