Premalu Movie Telugu Review & Rating: యువ ప్రేమికులు యువత మెచ్చే మంచి ఎంటర్టైనర్ ఈ ప్రేమలు !

Premalu Telugu Review and Rating by 18fms e1710046856766

చిత్రం: ప్రేమలు 

విడుదల తేదీ : మార్చి 08, 2024

నటీనటులు: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు.

దర్శకుడు: గిరీష్ ఎ.డి,

నిర్మాత: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్,

సంగీత దర్శకులు: విష్ణు విజయ్,

సినిమాటోగ్రాఫర్‌: అజ్మల్ సాంబు,

ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్, వర్గీస్,

మూవీ: ప్రేమలు  రివ్యూ  ( Movie Review)  

మలయాళం లో సూపర్ హిట్ అయిన లేటెస్ట్ మూవీ ప్రేమలు. ఈ చిత్రం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా దర్శకుడు గిరీష్ తెరకెక్కించారు.  ఈ ప్రేమలు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం SS రాజమౌళి సన్ SS కార్తికేయ తెలుగులో ఈ శుక్రవారం  విడుదల చేశారు. మరి మలయాళం లో అంత పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు  ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో మా 18F మూవీస్ సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

Premalu Review and Rating by 18fms success meet 1

సచిన్ (నస్లెన్ కె. గఫూర్) కేరళలొని  ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. తన ఇంజనీరింగ్ కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఐతే, ఆ ఆమ్మాయి నో చెప్పడం తో భాదపడుతూ ఇక్కడ ఉండటం ఇష్టం లేక యూ.కే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక మరో క్లాస్ మెట్ ఫ్రెండ్ తో  గేట్ కోచింగ్‌ అంటూ హైదరాబాద్ వస్తాడు.

మరోవైపు రీనూ (మమితా బైజు) కూడా ఐటీ జాబ్ కోసం కేరళ నుండి హైదరాబాద్‌‌‌ వచ్చి  జాబ్ చేస్తుంటుంది.

అసలు సచిన్ – రీనూ ఎలా కలిశారు ?,

రీనూ జులై గా తిరిగే స్టూడెంట్ అయిన సచిన్ ని ఎందుకు ప్రాణంగా ప్రేమిస్తోంది ?,

ఈ మధ్యలో రీనూ ని ప్రేమిస్తున్న ఆది ఏమి చేశాడు ?,

అది కి రీనూ కి మధ్య ఉన్న సంభంధం ఏమిటి ?

ఆది సచిన్ ని ఎందుకు అనుమాణిస్తాడు ?

సచిన్ – రీనూ ల  ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది ?,

ఇంతకీ, సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా ? లేదా ?

అనే ప్రశ్నలకు ఇంటరెస్టింగ్ జవాబులు తెలియాలి అంటే వెంటనే మీ గ్యాంగ్ తో ప్రేమలు అదే దియేటర్ కి వెళ్ళి చూసేయండి. 100 % ట్రేస్ బరాష్టర్ మూవీ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ తో వెళ్తే హాయిగా నవ్వుకోవచ్చు.

Premalu Review and Rating by 18fms success meet 0

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ప్రేమలు చిత్ర దర్శకుడు గిరీష్ ఎ.డి రెండు వేరు వేరు మనష్టత్వాలు ఉన్న పాత్రలకు సంబంధించిన మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, అలాగే ఆ లైన్ ను ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకుని మెప్పించే ప్రయత్నం చేశాడు.  కొన్నిచోట్ల ముఖ్యంగా రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో కొన్ని సీన్స్ ను సింపుల్ గా డిజైన్ చేయడం వలన కొంచెం రొటీన్ సినిమాలనే అనిపఇస్తుంది.

అలాగే మెయిన్ హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని సీన్స్ కూడా బాగా స్లోగా సాగాయి. సచిన్ – రీనూ ల మధ్య  ప్రేమ కథకు ఇంకా బలమైన కన్ఫ్లిట్  ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. అదేవిధంగా  హీరోహీరోయిన్ల మధ్య పెట్టిన ఒకటి రెండు సీన్స్ బాగా స్లో గా ఉనాయి. అవి లేకుండా ఉండి ఉంటే బాగుండేది.

ఇక రెండవ అంకం (సెకండాఫ్) ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. కొన్ని నెగిటివిటీ ఇష్యూ లు కూడా ఉన్నాయి. లాజిక్ లు చూడకుండా కధలో ఇన్వాల్వ్  అయితే కధనం (స్క్రీన్ – ప్లే) లో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా మార్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

Premalu Review and Rating by 18fms success meet 5

దర్శకుడు గిరీష్ ఎ.డి రాసుకున్న కధ మరియు కధనం చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైన్ గా చెప్పాడు. తెలుగు అనువాదం డైలాగ్స్ రాసిన అదిత్య హాసన్ (#90’S దర్శకుడు) కూడా ప్రస్తుత సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న మీమ్ తో రాయడం వలన దియేటర్ లో యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో రాసుకొన్న కొన్ని  కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే, ఎమోషనల్ గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి.

హీరోగా హీరోయిన్ ‘నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు’  పాత్రల మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి దర్శకుడు తను రాసుకొన్న కధకు పూర్తి న్యాయం చేస్తూ పాత్రదారులు కూడా చక్కగా నటించడం వలన  ప్రేమలు చిత్రం అందరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నస్లెన్ కె. గఫూర్ తన అమాయకమైన పేస్ తో మరియు తన ఈజ్ యాక్టింగ్ ,సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు.

Premalu Review and Rating by 18fms success meet 8 e1710047243755

హీరోయిన్ గా నటించిన మమితా బైజు తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. తన ఇన్నోసెంట్ ఫేస్ తో బాగా ఆకట్టుకుంది.

మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ లు కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

Premalu Review and Rating by 18fms success meet 1

సంగీత దర్శకుడు విష్ణు విజయ్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.  ఈ ప్రేమలు సినిమాకి  విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది అని చెప్పవచ్చు.

అజ్మల్ సాంబు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు గిరీష్ ఎ.డి ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే కు ఫోటోగ్రఫీ , మ్యూజిక్ మంచి తోర్పాటు అందించాయి అని చెప్పవచ్చు . హైదరాబాద్ సిటీ అందాలను చూపించి మెప్పించారు.

ఆకాష్ జోసెఫ్, వర్గీస్ ఎడిటింగ్ కూడా బాగుంది. కొన్ని సీన్స్  ఇంకా ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేది. స్లో అనే మాట లేకుండా చక్కగా సాగిపోయేది.

ఇక ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేమలు సినిమా కి  నిర్మాతలు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Premalu Review and Rating by 18fms success meet 6

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఈ ‘ప్రేమలు’ సినిమా లో కామెడీ సీన్స్, ఎమోషనల్ గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కొన్ని రొటీన్ సన్నివేశాలు వాటి కధనం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

ఓవరాల్ గా లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని చాలా అంశాలు కనెక్ట్ అవుతాయి. అలాగే, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.  క్లీన్ ఎంటర్టైనెంట్ కోరుకొనే ప్రేక్షకులకు ఈ వారం చూడదగ్గ సినిమా అవుతుంది.

చివరి మాట: ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ !

18F RATING: 3.5 / 5

   * కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *