ఘనంగా ‘ప్రేమకు జై’ ఫ్రీరిలీజ్ వేడుక

IMG 20250224 WA0178 scaled e1740407382508

ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై‘. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో తెరకేక్కిన ఈ మూవీ ఫ్రీరిలీజ్ వేడుక కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఈ వేడుకలో గెస్టుగా పాల్గొన్న దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. “చిన్న బడ్జెట్ సినిమానా? భారీ బడ్జెట్ సినిమానా? అని ప్రేక్షకులు చూడరు. బాగుంటే ఏ సినిమానైనా బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాంటి బాగున్న సినిమా లిస్టులోకి వస్తుంది ఈ ‘ప్రేమకు జై’చిత్రం.

   ఈ మూవీ పాటలు, ట్రైలర్, పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి. దర్శకుడు మల్లం శ్రీనివాస్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.” అని అన్నారు.

IMG 20250224 WA0180

దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో చోటు చేసుకున్న ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకేక్కించాము. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కృషి, సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎంతో సహకరించారు. ‘ప్రేమకు జై’ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం.” అని అన్నారు.

కో ప్రోడ్యూసర్: మైలారం రాజు మాట్లాడుతూ.. యూత్ కు నచ్చే సబ్జెక్టును దర్శకుడు చాలా బాగా తెరకేక్కించారు. వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానున్న ‘ప్రేమకు జై’ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ జై కొడతారని ఆశిస్తున్నాము.” అని అన్నారు.

IMG 20250224 WA0182

హీరోహీరోయిన్లు అనిల్ బురగాని, ఆర్ జ్వలిత మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు తెలిపారు. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

 ‘ప్రేమకు జై’ ఫ్రీరిలీజ్ వేడుకలో నటుడు అధిరే అభి, నిర్మాత ఎమ్ ఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర యూనిట్ :

అనిల్ బురగాని (హీరో), ఆర్. జ్వలిత (హీరోయిన్),దుబ్బాక భాస్కర్ (ప్రతినాయకుడు), కథ, దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం,నిర్మాత: అనసూర్య,, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం రాజేష్,లైన్ ప్రొడ్యూసర్: మైలారం రాజు,సంగీతం: చైతు, సినిమాటోగ్రాఫర్ : ఉరుకుందా రెడ్డి, ఎడిటర్: సామ్రాట్ , పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యల అశోక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *