Prema Desapu Yovarani Item Song:‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్‌..* వినూత్న రీతిలో తాగేసిపో బార్‌లో లాంచ్‌ చేసిన మూవీ టీమ్‌ !

IMG 20230817 WA0039 e1692262471376

 

యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకుడు. ఈ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని మణికొండలోని తాగేసిపో అని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో విడుదల చేశారు.

maxresdefault 1
ఈ సందర్భంగా హీరో యామిన్‌ మాట్లాడుతూ ‘ఓపెన్‌ బార్‌లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్‌ మేమిలా వినూత్నంగా ప్లాన్‌ చేశాం. దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు.

IMG 20230816 WA0103

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది. బార్‌లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా… కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

prema1

*నటీనటులు*
మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు.

IMG 20230816 WA0106

*సాంకేతిక నిపుణులు*
కెమెరా: శివకుమార్‌ దేవరకొండ,
సంగీతం: అజయ్‌ పట్నాయక్‌,
ఎడిటర్‌: ఎం.ఆర్‌. వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ,
సౌండ్‌ మిక్స్‌: జయంతన్‌ సురశ్‌
కొరియోగ్రఫీ: కపిల్‌, శ్రీవీర్‌
సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తం రాజు,
ఫైట్స్‌: శివ్‌రాజ్‌
డిఐ: వెంకట్‌
స్టిల్స్‌ జగన్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి
మేకప్‌: అనిల్‌, భాను
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: ఎంకెఎస్‌ మనోజ్‌
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌: సారథి స్టూడియోస్‌
నిర్మాతలు: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
రచన – దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల.

IMG 20230814 WA0122

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *