మూవీ: ప్రేమ్ కుమార్ (Prem Kumar):
విడుదల తేదీ : ఆగస్టు 18, 2023
నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు
దర్శకుడు : అభిషేక్ మహర్షి
నిర్మాత: శివప్రసాద్ పన్నీరు
సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్
సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం
ఎడిటర్: గ్యారీ బి హెచ్
ప్రేమ్ కుమార్ మూవీ రివ్యూ:
అభిషేక్ మహర్షి నటుడిగా అందరికీ పరిచయం. ఇప్పడు ప్రేమ్ కుమార్ అనే కధ తో దర్శకుడిగా పరిచయమై అయ్యాడు. ప్రేమ్ కుమార్ సినిమా లో సంతోష్ శోభన్ కథానాయకుడుగా . రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లు గా నిర్మితమైంది.
మరి ఈ ప్రేమ్ కుమార్ చిత్రం ఈ శుక్రవారమే విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మా 18f మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందా మా !
కథ ని పరిశీలిస్తే (Story line):
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) ల పెళ్లి జరుగుతూ ఉండగా.. రైజింగ్ రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. తానూ, నేత్ర ప్రేమించుకున్నామని… ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ప్రేమ్ కుమార్ కి మరి కొన్ని పెళ్లిళ్లు దగ్గరకు వచ్చీ ఆగిపోతూ ఉంటాయి. అయినా, ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అవ్వడం, అదీ క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఇలా పెళ్లి కావడం లేదని ఫ్రస్ట్రేషన్ లో ప్రేమ్ కుమార్ ఏం చేశాడు ?,
తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ ఎందుకు పెట్టాడు ?,
ప్రేమ్ కుమార్ మరలా నేత్రా ని కలిశాడా ?,
ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?
చివరకు ప్రేమ్ కుమార్ నేత్ర ఒకటవుతారా ? లేదా ?
రైజింగ్ స్టార్ రోషన్ నేత్రాల పెళ్లి జరిగిందా ?
ప్రేమ్ కుమార్ ఎందుకు పెళ్ళిళ్ళు చెడ కొడుతుంటాడు ?
అనేది మిగిలిన కథ. మీకు కొంచెం అయినా పైన ప్రశ్నలు ఇంటరెస్ట్ కలిగిస్టే ఓక సారీ ట్రై చేయండి లేకపోతే ఓటిటి లో వచ్చే వరకూ వైట్ చేయండి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
దర్శకుడు అభిషేక్ మహర్షి మంచి ఫన్ వర్కౌట్ అయ్యే స్టోరీ రాసుకొన్నా కధనం విశయం లో శ్రద్ద లేక సినిమాని ఇంటరెస్ట్ గా మలచలేక పోయాడు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సిల్లీ ట్రాక్స్ తో బోరింగ్ క్యారెక్టర్స్ తో సినిమాని బోర్ కొట్టించారు.
ప్రేమ్ కుమార్ క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా ఇల్లాజికల్ గా ఉంది. దీనికి తోడు చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు అభిషేక్. అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. కొంచెం అయినా బెటర్ గా ఉండేది.
హీరో హీరోయిన్లు కొన్ని సీన్స్ లో అయితే మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఈ ప్రేమ్ కుమార్ సినిమా కథ కథనాలు మరీ స్లోగా సాగడం వలన చాలా బోరింగ్ ప్లే లా ఉంది. మొత్తానికి ఈ రెగ్యులర్ సిల్లీ బోరింగ్ కామెడీ డ్రామా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు అభిషేక్ మహర్షి ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించ లేకపోయాడు అని చెప్పాలి.
నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
సంతోష్ శోభన్ పోషించిన ప్రధాన పాత్ర అయిన ప్రేమ్ కుమార్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సిల్లీ కామెడీ సీన్స్.. ఇలా మొత్తానికి ప్రేమ్ కుమార్ సినిమా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది.
హీరోగా నటించిన సంతోష్ శోభన్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సంతోష్ శోభన్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.
కీలక పాత్రలో నటించిన రాశి సింగ్ కూడా చాలా బాగా నటించింది. రుచితా సాధినేని కూడా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి.
కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్యలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
దర్శకుడు అభిషేక్ మహర్షి తాను రాసుకున్న కథను పేపర్ మీద స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ లోను బాగున్నా తెరమీద తేలిపోయింది. కధ వస్తూ చిన్నదే అయిన స్క్రీన్ – ప్లే మీద ఇంకొంచం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
రాంపీ నందిగం సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.
ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఉంటే బాగుండేది.
గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాగుంది. కధ లో దమ్ము లేనప్పుడు టెక్నీషియన్స్ ఏమి చేయలేరు. సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
సంతోష్ శోభన్ నుండి ‘ప్రేమ్ కుమార్’ అంటూ వచ్చిన ఈ సిల్లీ కామెడీ డ్రామా లో కొత్తదనం అంటూ చెత్త కామిడీ తో ఆకట్టుకో లేకపోయాడు. ఎందుకు కధ ముందుకు వెళ్తుందో తెలిసినా కృత్రిమ ఎమోషన్స్ తో బోరింగ్ కధనం మరియు పూర్తి సినిమాటిక్ నటన లాంటి అంశాలు కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
సంతోష్ శోభన్ స్పోటినియస్ నటన, కొన్ని కామెడీ సీన్స్ తప్ప, అంతకు మించి ఈ చిత్రంలో కంటెంట్ కోసం భూతద్దం పెట్టి వేదికినా కనబడదు. మొత్తమ్మీద సంతోష్ నుండి వచ్చిన ఈ అయోమయం ప్రేమ్ కుమార్ సినీ లవర్స్ ని కూడా నిరుత్సాహపరుస్తుంది.
టాగ్ లైన్: కధ ఎక్కడ ప్రేమ్ కుమార్ !
18F Movies రేటింగ్: 2.25 / 5
* కృష్ణ ప్రగడ.