చిత్రం: ప్రసన్నవదనం,
విడుదల తేదీ : మే 03, 2024,
నటీనటులు: సుహాస్,పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు, హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత తదితరులు..,
దర్శకుడు: అర్జున్ వై.కె,
నిర్మాత: మణికంఠ, ప్రసాద్ రెడ్డి,
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్,
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్,
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్,
మూవీ: రివ్యూ ( Movie Review)
వెరీ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన మరో సినిమా ప్రసన్నవదనం. ఈ శుక్ర వారం తెలుగు ప్రేక్షకులను ఈ ప్రసన్న వదనం చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
సూర్య ( సుహాస్ ) తన తల్లితండ్రులతో కలిసి కారులో వెళ్తూ ఉండగా వారి కారు యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ ప్రమాదంలో సూర్య తల్లి తండ్రులు చనిపోతారు. సూర్య కి ఫేస్ బ్లైండ్ నెస్ (ముఖ కవళికలు గుర్తుపట్టలేని) అనే ఒక అరుదైన వ్యాధి వస్తోంది.
మరోవైపు సూర్య రేడియో మిర్చిలో జాకీగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్యకి ఆధ్య (పాయల్ రాధాకృష్ణ)తో పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఐతే, అమృత (సాయిశ్వేత) అనే అమ్మాయి హత్య కేసులో సూర్య ఇరుక్కుంటాడు.
అసలు సూర్య కధలో అమృత ఎవరు ?,
అమృతను చంపంది ఎవరు ?,
ఈ మొత్తం వ్యవహారంలో ACP వైదేహి (రాశీ సింగ్ ) పాత్ర ఏమిటి ?,
అమృత ని చంపిన నేరస్తుల్ని సూర్య ఎలా పట్టుకున్నాడు?,
అమృత కేసు నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు ?,
వంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి ప్రసన్న వదనం సినిమా చూడవలసిందే !.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు అర్జున్ వై.కె ఫేస్ బ్లైండ్ నెస్ కి సంబంధించి ఇప్పటి వరకూ ఇండియన్ వెండితెర మీద కధ గా రాని మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కధనం ( స్క్రీన్ ప్లే) ను రాసుకోలేదు. హీరో- హీరోయిన్ మధ్య ఉన్న సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి.
వారి ప్రేమకు బలమైన కధనం కూడా లేదు. ఇక హీరో పాత్ర కూడా మరొకరికి సాయం చేయడానికే ఉంది అన్నట్టు చాలా సీన్స్ లో చూపించారు. దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో సాగింది.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ డ్రామటిక్ గా ఉన్నాయి. ఇక రెండవ అంకం (సెకండాఫ్) ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు.
చాలా సీన్స్ సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో కధనం సాగదీశాడు దర్శకుడు. ఎంత లాజికల్ గా కధను చెప్పాలనుకొన్నా పాత్రల మద్య మంచి బాండింగ్ ఉండాలి. మంచి కనెక్షన్ కూదరాలి. సుహాస్ ఒక్కడే మొత్తం సినిమా కధని మోయలేదు కదా !
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు అర్జున్ వై.కె ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాణి కధను వ్రాసుకొన్నా, కధకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. డెఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘ప్రసన్నవదనం’ సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.
హీరోగా సుహాస్ (Suhas) సూర్య పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ సినిమా చాలా చోట్ల బాగానే ఆకట్టుకుంది.
సుహాస్ కూడా తన యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధ పడే సూర్య పాత్రలో సుహాస్ చాలా బాగా ఒదిగిపోయాడు.
హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ తన లుక్స్ తో ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలో నటించిన రాశీ సింగ్ తన నటనతో మెప్పించింది. ఆమె పాత్ర కూడా బాగుంది. మరో కీలక పాత్రలో నందు చాలా బాగా నటించాడు. అలాగే నితిన్ ప్రసన్న, హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం (BGM) కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకూ ప్రేమ కధలకు మాత్రమే సంగీతం అందుస్తాడు అనుకొంటున్న విజయ్ ఈ చిత్రం తో తను అన్ని జోనర్ సినిమా లకు వెరైటీ మ్యూజిక్ ఇవ్వగలను అని ప్రూఫ్ చేసుకొన్నాడు.
కార్తీక శ్రీనివాస్ ఆర్ఎ డిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. స్లో అండ్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండును.
ఎస్.చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. మినిమమ్ బడ్జెట్ లో మాక్సిమం క్వాలిటి అవుట్ పుట్ ఇచ్చారు.
నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లోనైనా మంచి టెక్నీషియన్స్ ని పెట్టుకొని క్వాలిటి సినిమా అందించగలిగారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
సుహాస్ లొని సహజ ఎమోషనల్ నటన తో ప్రసన్నవదనం అంటూ వచ్చిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ, చాలా సీన్లు రెగ్యులర్ గా సాగడం, రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో స్క్రీన్ ప్లే సింపుల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. సినిమాలో విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అలానే సుహాస్ నటన కూడా సినిమా ని ఓకరకంగా నిలబెట్టినట్టు చెప్పుకోవాలి.