‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్ సినిమాకు అనూహ్య స్పందన !

IMG 20241229 WA0183 scaled e1735471601170

 జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా ”అమ్మ నీకు వందనం”,  ‘‘క్యాంపస్ అంపశయ్య’’,  “ప్రణయ వీధుల్లో” వంటి సామాజిక, ప్రయోజనాత్మక సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. డిసెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతూ  విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా…

చిత్ర నిర్మాత శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ:  తెలంగాణాకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు గారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమాను మేము ఎంతో దృఢ సంకల్పంతో రాత్రింబవళ్ళు కష్టపడి ఇష్టంగా నిర్మించడం జరిగింది.అయితే ఈ సినిమాను  మేము వ్యాపార పరంగా కాకుండా కళాత్మకంగా సినిమా తీయడం జరిగింది. అందుకే ముందు భవిష్యత్ తరాలైన విద్యార్థులకు కాళోజి గారి చరిత్ర గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు థియేటర్ లో ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించడం జరిగింది.

ఇందుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . అయితే మేము అనుకున్న ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. చరిత్ర కలిగిన ఇలాంటి సినిమా కెరీర్ పరంగా నాకు మంచి గుర్తింపుగా భావిస్తున్నాను .ఇలాంటి మంచి సినిమాను నాకు ఇచ్చిన చిత్ర దర్శకుడు, నా శ్రీ వారు ప్రభాకర్ జైనీ కి థాంక్యూ సో మచ్ అని అన్నారు.

IMG 20241229 WA0187

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి  రోజూ ఉదయం ఆటను స్కూలు పిల్లలకు ఉచితంగా థియేటర్లలో ప్రదర్శించడం జరిగింది. మేము ఊహించిన దాని కన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ కు సంహరించిన గవర్నమెంట్ పెద్దలకు నా ధన్యవాదాలు అని అన్నారు.

IMG 20241229 WA0189

నటీ నటులు:

కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.  మిసెస్ ఇండియా  సుష్మా తోడేటి తదితరులు

సాంకేతిక నిపుణులు: 

బ్యానర్: జైనీ క్రియేషన్స్,నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ., కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల,సంగీతం: యస్.యస్.ఆత్రేయ,నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,సెకండ్ యూనిట్ కెమెరా:  భాస్కర్,పి. ఆర్. ఓ : మూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *