Poye Enuga Poye Movie Update: అక్టోబర్ రెండో వారంలో గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న `పోయే ఏనుగు పోయే!

IMG 20230927 WA0097

 

కె యస్ నాయక్రూ దర్శకత్వం లో పొందుతోన్న విభిన్నాత్మ‌క చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబ‌ట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని అక్టోబర్ రెండో వారంలో గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది.

IMG 20230927 WA0099

 ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కె.శ‌ర‌వ‌ణ‌న్ మాట్లాడుతూ…“ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన `పోయే ఏనుగు పోయే` చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు… దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్ర‌తి సీన్ అడ్వెంచ‌రస్ గా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.

IMG 20230927 WA0098

ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా సినిమాను తీర్చి దిద్దాము. అక్టోబర్ రెండో వారంలో విడుద‌ల‌వుతోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

IMG 20230927 WA0096

 ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో; పీఆర్వోః బి . వీరబాబు ,సినిమాటోగ్ర‌ఫీః అశోక్ రెడ్డి.కె; నిర్మాత‌-ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః కె.య‌స్. నాయ‌క్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *