పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్” టీజర్  !

dude Movie 1 e1749806300558

మల్టీ టాలెంటెడ్ తేజ్ నటిస్తూ కన్నడ – తెలుగు – మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న “డ్యూడ్” చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!

dude Movie 2

హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ… “హీరోగా, డైరెక్టర్ గా ‘డ్యూడ్” చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం” అని అన్నారు.

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

dude Movie

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష… ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీత సారధి. “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *