Polishetty goes USA: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం యూఎస్ ప్రమోషనల్ టూర్ కు వెళ్లనున్న హీరో నవీన్ పోలిశెట్టి !

IMG 20230903 WA0113

 

తన కొత్త సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు

IMG 20230902 WA0117

నవీన్ పోలిశెట్టి. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

IMG 20230902 WA0114

ఇలాంటి ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి. అమెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి.

IMG 20230903 WA0102

ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు.

IMG 20230903 WA0121

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యాంగిర సినిమాస్ యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *