Polimera2 Movie Review & Rating: మర్డర్ మిస్టరీ ట్విస్టులు తో సాగే థ్రిల్లర్ మూవీ పొలిమేర2

polimera2 review by 18F movies 1 e1699105542640

 

మూవీ: (Polimera2)

విడుదల తేదీ : నవంబర్ 03, 2023

నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు

దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌

నిర్మాత: గౌరీ కృష్ణ

సంగీతం: జ్ఞాని

సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి

ఎడిటర్: శ్రీ వర

   మూవీ రివ్యూ:(Polimera2 Review)

డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల లో  వచ్చిన మా ఊరి పొలిమేర సిన్మా  ఓటీటీ లో వచ్చి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పార్ట్ 1 ముగింపు లో ఇచ్చిన లీడ్ చూసిన  ప్రేక్షకులకు  రెండవ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనే ఆతృత కలిగించింది.

ఈ క్రమంలో, ఈ శుక్రవారం  మా ఊరి పొలిమేర 2 సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మెదటి పార్ట్ లనే ఈ రెండవ పార్ట్ ప్రేక్షకులను దియేటర్స్ లో ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తాదో తెలియాలి అంటే మా 18F  మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

polimera2 review by 18F 4

తెలంగాణ లొని జాస్తిపల్లి అనే గ్రామంలో కొమిరి (సత్యం రాజేష్), బలిజ (గెటప్ శీను), జంగయ్య (బాలాదిత్య), కవిత (రమ్య), లచ్చిమి (కామాక్షి భాస్కర్ల) పాత్రల్ని పరిచయం చేస్తూ.. ఫస్టాఫ్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కవితను చంపిన కొమిరే.. ఈ క్షుద్రపూజలు చేస్తున్నాడనే నిజాన్ని తెలుసుకుంటాడు కొమిరి తమ్ముడు కానిస్టేబుల్ జంగయ్య. తన అన్నని వెతుక్కుంటూ వెళ్లడంతో ‘పొలిమేర 2’ మొదలౌతుంది. మూఢనమ్మకాలతో పాటు.. జాస్తిపల్లిలోని పెత్తందారి వ్యవస్థను రియాలిటీ దగ్గరగా చూపించారు.

కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవిత (రమ్య ) తో కలిసి కేరళకు పారిపోవాదానికి పెదనాన్న సహాయపడతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు.

ఈ క్రమంలో జాస్తిపల్లి గ్రామం పొలిమేర లో మూత బడిన గుడి ప్రముఖ్యాత ఏంటి ?

ఈ మధ్యలో ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు భావిస్తోంది ?,

జాస్తిపల్లి  గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు?,

ఇంతకీ ఆ గుడి చుట్టూ జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఏమిటి ?,

నిజంగా ఆ గుడి లో గుప్త నిధులు ఉన్నాయా ? లేదా ఇంకా ఏముంది?,

జంగయ్య చనిపోయాడు అనుకొంటున్న తన సోదరుడు కోమరయ్య ని గుర్తించాడా ?, లేదా ?,

జాస్తిపల్లి గుడికి కేరళ లొని సుబ్రమణ్య స్వామి గుడి కి మద్య ఉన్న సంభందం ఏమిటి ? 

చివరికి ఈ కధ ఎలా  ముగిసింది ? అనేది మిగిలిన కథ.

మా ఊరి పొలిమేర సినిమా కి మూడో పార్ట్ ఉందా లేదా అనే ట్విస్ట్ కూడా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది.

కధనం పరిశీలిస్తే (Screen – Play) : 

ఈ రెండోవ భాగం మొత్తం ఏ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో.. ఆ పాయింట్ కి సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం అనే అసంతృప్తి ఉన్నా కధనం (స్క్రీన్ – ప్లే) తో కొంతమేర ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు డాక్టర్ డైరెక్టర్ సాబ్. ఇక కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని వ్రాసుకోవడం వలన కొంత మంది ప్రేక్షకులు సాగతీత గా ఉంది అని ఫీల్ అయినా మెయిన్ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ తో కధనం గట్టెక్కింది అని చెప్పవచ్చు.

ఓవరాల్ గా  దర్శకుడు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రతిభ సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు కొంత స్లోగా సాగడం వలన రిపీట్ ఆడియన్స్ కి  అస్సలునచ్చకపోవచ్చు.

దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టినా  కొన్ని అనవసరమైన సీన్స్ అంటే, SI పాత్ర ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అయి కధ ని చెప్పడం వంటివి కథ ను డైవర్ట్  చేశాయి అనిపిస్తుంది. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కొన్ని క్రైమ్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  కధనం మర్చి ఉంటే సినిమా సక్సెస్ రేంజ్ మారేది.

polimera2 review by 18F 2

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

డాక్టర్ అనిల్ విశ్వనాధ్ దర్శకుడిగా వచ్చిన, ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను కధకుడిగా  దర్శకుడు వ్రాసుకొని బాగానే తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సీన్స్ ను తెరకెక్కించడంలో దర్శకుడిగా  సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.

మా ఊరి పొలిమేర- 2 లో ప్రధానంగా మొదటి భాగం నుండి రెండవ భాగానికి  లింక్ అప్ చేసే సీన్స్ , అలాగే సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ట్విస్టులు బాగున్నాయి.  ఈ పార్ట్ -2 కి ప్రధాన బలం ట్విస్ట్ లు టర్న్స్ తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. ఇక నిధి చుట్టూ జరిగిన డ్రామా లోని ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే నిధి చుట్టూ అల్లిన కధ మాత్రం కొంచెం రొటీన్ కధనం అనిపించినా ఎమోషన్ డ్రైవ్ బాగా పండటం వలన ప్రేక్షకులు సస్పెన్స్ సీన్స్ తో ట్రావెల్ ఆయిపోతారు.

 మెయిన్ లీడ్ గా నటించిన సత్యం రాజేష్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

 డాక్టర్ కామాక్షి భాస్కర్ల కూడా  కీలక మైన పాత్రలో నటించి చాలా బాగా మెప్పించింది. ఆమె హావ భావాలు, డైలాగ్ డెలివరీ, కొన్ని సీన్స్ లొని ఎమోషన్ లో  కూడా బాగానే నటించింది. ప్లే చేసింది ఒక కేరక్టర్ అయిన, అన్ని పాత్రల కంటే డాక్టర్ కామాక్షిపోషించిన  లక్ష్మీ పాత్రకి నటించే స్కోప్ ఎక్కువ ఉండుట వలన ఆమె జీవించింది అని చెప్పవచ్చు.

బాలాదిత్య పాత్రకు ఈ రెండో పార్ట్ లో ఎక్కువ స్కోప్ దొరకలేదు. కానీ, క్లైమాక్స్ లో బాలాదిత్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. చూడాలి మూడో పార్ట్ లో ఇంపార్ట్నట్ ఉండి ఉండవచ్చు.

బలిజ పాత్ర లో  గెటప్ శ్రీను కూడా ఆకట్టుకున్నాడు. మెయిన్ లీడ్ కోమరియ్యా ( సత్యం రాజేష్) తో పాటు బలిజ గా గెటప్ శ్రీను కూడా మంచి నటనతో ఆకట్టుకొన్నాడు.

రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

polimera2 review by 18F 1

సంగీత దర్శకుడు జ్ఞాని సమకూర్చిన నేపథ్యం సంగీతం బాగుంది. కొన్ని నైట్ జరిగే సీన్స్ లో వచ్చే బాక్ గ్రౌండ్ స్కోర్ భయపెడుతుంది. రాత్రులు లేట్ నైట్ షో చూసి వంటరీగా వెళ్ళే వాళ్ళకి మ్యూజిక్ వెంబడిస్తాది.

కుశిదర్ రమేష్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది.

శ్రీ వర ఎడిటింగ్ బాగుంది. సినిమా నిడివి కూడా 127 మినిట్స్ ఉండడం కూడా ప్లస్ పాయింట్ నే. ఎడిటర్ కూడా చాలా కష్టపడి చేసినట్టు అనిపిస్తుంది.

ఈ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అనుకొన్న బడ్జెట్ ని మించి కార్చుపెట్టినా, ఆ ఖర్చు సినిమా క్వాలిటి లో తెలుస్తుంది.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

‘మా ఊరి పొలిమేర కి కొనసాగింపుగా వచ్చిన ఈ మా ఊరి పొలిమేర – 2’ చిత్రం  కొంచెం క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్  డ్రామా గా నే సాగింది. ముఖ్యంగా పాత్ర లలో నటించిన నటీనటుల నటన స్క్రీన్ – ప్లే లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొన్ని  భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు Dr అనిల్.

కథను లార్జర్ స్కేల్ లో ఓపెన్ చేసినా మరో భాగం కోసం దాచికొని ఈ పార్ట్ -2 లో కథనం (స్క్రీన్ – ప్లే) కొంచెం  స్లోగా సాగదీశాడా అనిపిస్తుంది. మెయిన్ కథకు అనవసరం లేని కొన్ని   సన్నివేశాలతో సినిమా కధని సాగదీయడం  వంటి అంశాలు రిపీట్ ఆడియన్స్ ని లేకుండా చేస్తాయి.

మొత్తమ్మీద ఈ పొలిమేర -2 చూసే ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ట్విస్టులు, డెఫెరెంట్ క్రైమ్ సీన్స్, క్లైమాక్స్ లోని ఎమోషన్స్ బాగానే  ఆకట్టుకొంటాయి. మొదటి భాగం చూడని వారికి కూడా రెండవ భాగం బాగానే అర్దం అవుతుంది. ఇంకా మా ఊరి  పొలిమేర చూసిన వారికి ఈ పొలిమేర-2 అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అవే పాత్రల చుట్టూ కధ ఉంది కాబట్టి. ఒవెరల్ గా ఈ పొలిమేర – 2 మాత్రం దియేటర్ లోనే చూడవలసిన సినిమా.

చివరి మాట: దియేటర్ నుండి ఊరి పొలిమేర వరకూ భయపెడుతుంది..

18F RATING: 3 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *