సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన మా ఊరి పొలిమేర 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయ్యింది.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మా ఊరి పొలిమెర 2, నవంబర్ 3, 2023న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర అంటూ చిత్రం చేసినా అప్పటి దియేటర్ లాక్ డౌన్ పరిస్తుతుల వలన OTT వేదికగా విడుదల అయ్యి, ప్రేక్షకులనుంది మంచి రేస్స్పాన్స్ సాదించింది.
అదే టీం తో అనిల్ ఇప్పుడు కొంచెం బిగ్గర్ కాణ్వాస్ తో పొలిమేర 2 అంటూ అదే కధకు సీక్వెల్ గా నిర్మించారు.
ఇప్పడు ఈ పొలిమేర 2 చిత్ర ప్రి రిలీస్ ఈవెంట్‌కు నటుడు అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. ఇంకా కొంత సేపటి లో అడివి శేష్ రావచ్చు. ఈ పొలిమేర 2 ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ నిర్మించగా, వంశీ నందిపాటి పంపిణీ చేయనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.