PK Fans Movie Opens: గోదావరి ఒడ్డున కొవ్వూరు లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం ఆయిన పవర్ స్టార్ ఫ్యాన్స్ మూవీ !

IMG 20231024 WA0134 e1698154940721

 

*కొవ్వూరు గోదావరి ఒడ్డున పవర్ స్టార్ ఫాన్స్ మూవీ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టిన నటుడు భానుచందర్, టివి రామారావు

*హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కళ్యాణ్ రాజా కరుటూరి

*’వ్యూహం’ కు ధీటైన సినిమాగా జనసేన నేతల అభివర్ణన

*నవంబర్ 15నుంచిషెడ్యూల్, జనవరిలో విడుదల : నిర్మాత షర్మిలా నాయుడు

 నూతన నటుడు కళ్యాణ్ రాజా కరుటూరి హీరోగా నటిస్తూ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ‘పవర్ స్టార్ ఫాన్స్’మూవీ ముహూర్తపు షాట్ విజయ దశమి పర్వదినాన చేసారు. కొవ్వూరు ‘ బ్రాహ్మణ రేవు” శివాలయంలో నటుడు భానుచందర్, మాజీ ఎమ్మెల్యే టి.వి. రామరావు సోమవారం ఉదయం 8. 21నిలకు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

IMG 20231024 WA0136

శ్రీ వారాహి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై వి షర్మిలా నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో..’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. మైథిలి మిత్ర నూతన పరిచయంతో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సందర్బంగా భానుచందర్ మీడియాతో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మంచి క్రేజ్ అని, ఆయన పెట్టిన పార్టీకి సపోర్టుగా తీస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

   చిత్ర హీరో, దర్శకుడు కళ్యాణ్ రాజా కరుటూరి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం కథను రాసుకున్నా నని,  అప్పటినుంచి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఫలించిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ సమాజానికి ఏవిధంగా ఉపయోగపడాలి, సమాజంలో ఎలా వ్యవహరించాలి అనే ప్రధాన అంశంతో అన్ని హంగులు ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తు న్నట్లు చెప్పారు.

నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా మూడు భాషల్లో ఈ సినిమా రూపొందించనున్నట్లు చెప్పారు.

నిర్మాత షర్మిలా నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అభిమానులు ఎలా ఉండాలో ఈ చిత్రంలో చెప్పబోతున్నామ న్నారు. నవంబర్ 15నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జనవరిలో విడుదల చేయాలని చూస్తున్నామన్నారు.

జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ప్రభుత్వానికి సపోర్టుగా వ్యూహం సినిమా తీస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవర్ స్టార్ ఫాన్స్ మూవీ సినిమా తీయడం అంటే నిజంగా గ్రేట్ అని అన్నారు.

IMG 20231024 WA0140

హీరోయిన్ మైథిలి మిత్ర ఇది తనకు తొలి చిత్రమని చెబుతూ, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే టివి రామారావు, జనసేన నాయకుడు వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

నటులు హేమసుందర్, మాట్లాడుతూ కళ్యాణ్ రాజా కరుటూరి ఎంతోకాలం నుంచి చేస్తున్న ప్రయత్నం కొలిక్కి రావడం ఆనందంగా ఉందన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, హైపర్ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈసందర్బంగా దొరబాబు , రాజు మాట్లాడుతూ కళ్యాణ్ రాజా చాలా కష్టపడి ఈ సినిమాతో హీరోగా మారారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఆదరించి సూపర్ హిట్ చేస్తారన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.

ఎంవిపిఎన్. చంద్ర, పీలా పొట్టి మూర్తి, ఆర్టిస్టు ధర్మతేజ, జనసైనికులు పాల్గొన్నారు.

నటీనటులు:

భాను చందర్, కళ్యాణ్ రాజా, మైథిలి, జబర్దస్త్ రైజింగ్ రాజ్, దొరబాబు తదితరులు

సాంకేతిక నిపుణులు:

 

నిర్మాత: షర్మిల నాయుడు, డైరెక్టర్: కళ్యాణ్ రాజా, కెమెరామెన్: శివారెడ్డి, ఫైట్స్ : డ్రాగెన్ ప్రకాష్, ఎడిటర్: నందమూరి హరి, పి.ఆర్.ఓ: లక్ష్మీ నివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *