Pindam Movie Telugu Review & Rating: పిండం దియేటర్స్ లో ఆడియెన్స్ ని భయపెడుతూ మెప్పిస్తుంది !

Pindam review e1702663100471

మూవీ : పిండం, 

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023

నటీనటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు

దర్శకుడు : సాయికిరణ్ దైదా

నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి

సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి

సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్

ఎడిటర్: శిరీష్ ప్రసాద్

   పిండం రివ్యూ (Pindam Review):

మానవ జీవ జన్మ పుట్టికకు కారణం పిండం అని, అలానే మానవులు చనిపోయినప్పుడు ఆత్మలకు పెట్టేది కూడా పిండం అనే పిలుస్తారు. ఇలా పుట్టికలో పాసిటివ్ ఎనర్జీ గా, చనిపోయిన వారికి పెట్టె పిండాన్ని నెగిటివ్ ఎనర్జీ గా మానవులు చూస్తుంటారు.

ఆలాంటి పాసిటివ్, నెగిటివ్ ఎనర్జీ లతో ఓక కధ అల్లుకొని ఆ కధని పిండం (Pindam) అనే టైటిల్ తో  సినిమా తీసి ఈ వారం థియేటర్స్ లోకి తీసుకొచ్చారు.  రీసెంట్ టైంలో హారర్ బ్యాక్ డ్రాప్ లో టైటిల్, టిజర్, ట్రైలర్ తో మూవీ మీద పాసిటివ్ బజ్ ని సెట్ చేసుకున్న  “పిండం” చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇంత పాసిటివ్ బజ్ క్రియేట్ చేసుకొన్న పిండం చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం  సమీక్షచదివి తెలుసుకుందామా !.

Pindam movie review by 18F movies 4

కధ పరిశీలిస్తే (Story Line): 

తాంత్రిక విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ(ఈశ్వరి రావు) ని రీసెర్చ్ స్కాలర్ అయిన లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) కలిసి తన గురించి చెప్పి తనతో కొన్ని రోజులు ఉంటూ తన రీసెర్చ్ పూర్తి చేయాలి అని ఇంటర్వ్యూ  చేస్తూ ఉంటాడు.  అలా సాగుతున్న ఇంటర్వ్యూ లో అన్నమ్మ ని తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అనే ప్రశ్నకి, అన్నమ్మ  1990 దశకంలో సుక్లాపేట్ లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన చెప్తుంది.

1990 లలోని కధలోకి వెళ్తే, రైస్ మిల్లులో అక్కౌంట్ గా పని చేసే ఆంటోనీ(శ్రీరామ్)  గర్భవతి అయినటువంటి తన భార్య మేరీ(ఖుషి రవి) తో పాటూ, తన తల్లి తో  సహా తమ ఇద్దరు పిల్లలతో కలిసి తను కొనుక్కొన్న పాత బంగ్లా లో దిగుతారు. కొన్ని అనుకోని సంఘటనలు తర్వాత నుంచి వారి ఇంట్లో అంతా అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది.

హ్యాపీ గా ఉన్న ఆంటోని ఫ్యామిలీ ని ఆ ఇంట్లో భయపెడుతుంది ఎవరు ?

ఆంటోని ఫ్యామిలీ కి ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా?

ఆ ఇంటికి నాయుడమ్మ కు సంభందం ఏమిటి ? 

ఆత్మలు నిజంగా చెడ్డవా ? మంచివా ? అసలు ఆత్మలు ఉన్నాయా ? 

అన్నమ్మ కి ఆంటోని కి మధ్య సంభందం ఏమిటి ? 

అసలు లోకనాధ్ ఎవరు ? ఎందుకు అన్నమ్మ ని వెదుక్కొంటూ వచ్చాడు ? 

ఆత్మలు ధశాబ్ద్దాలుగా బతికే ఉంటాయా ? 

అసలు ఋణారు భంధం అంటే ఏమిటి ? 

కడుపులో ఉన్న జీవ పిండానికి కూడా ఆత్మ ఉంటుందా ?  

చీరవరకు ఆంటోని కుటుంబం ఆ ఇంటి సమస్యలు నుండి ఎలా బయట పడుతుంది? 

అనే ప్రశ్నలు మీలో క్యూరాసిటీ క్రియేట్ చేస్తే వెంటనే దియేటర్ కి వెళ్ళి పిండం సినిమా చూసేయండి.

కధనం పరిశీలిస్తే (Screen – Play):

Pindam movie review by 18F movies 5

ఈ చిత్రం కధ వస్తువు పాతదే అయిన కొంతలో కొంత థ్రిల్లింగ్ కధనం (స్క్రీన్ – ప్లే ) ఓకే అనిపిస్తుంది. కానీ ఈ  సిన్మా  నిడివి చాలా పెద్దగా అనిపించింది. ఇలాంటి హర్రర్ కధలు 100 నుండి 120 మినిట్స్ ఉంటేనే బాగుంటాయి. సిన్మా లెంత్ ఎక్కువ అవడం వలన దర్శకుడు చెప్పాలి అనుకున్న పాయింట్ ని అనవసరంగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది.కొన్ని సీన్స్ ని తగ్గించి కట్ చేసి షార్ప్ గా ప్రెసెంట్ చేసి ఉంటే స్లో అనే మాట లేకుండా ప్రేక్షకుడు థ్రిల్ తో దియేటర్ బయటికి వచ్చేవాడు.

ఇంకా సినిమా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుంది. దీనితో అసలు సినిమాలో పాయింట్ కి తీసుకెళ్లడానికి ఇంత సాగదీయాలా అనిపిస్తుంది. వీటితో పాటుగా కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఎన్నో హారర్ సినిమాల్లో చూసిన సన్నివేశాల్లోనే  కధనం సాగిపోతుంది.

పిండం సినిమా  క్లైమాక్స్ లో ఇచ్చిన ఎండింగ్ (సెకండ్ పార్ట్ కి లీడ్ ) మాత్రం అంత కన్విన్స్ చేసే విధంగా లేదు. అలానే కొన్ని సీన్స్ లో  లాజిక్స్ కూడా బాగా మిస్ అయ్యాయి. అయితే టెక్నీకల్ గా మాత్రం ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కధ లో  1990 లలో జరిగే ఎపిసోడ్ లో ఇప్పుడు ఉన్న వస్తువులు కనిపిస్తాయి. అలాగే 1990 లో ఉన్న అన్నమ్మ  (ఈశ్వరీ రావు) లుక్ కి  ప్రస్తుతం లో జరిగే కధలొని అన్నయ్యమ్మ లుక్ కి పెద్ద తేడా లేకుండా ఉంది.

1990 నుండి 2023 కి సుమారు 33 సంవత్శరాలు ఉంది కాబట్టి, లుక్ లో కూడా ఆ తేడా చూపించి ఉంటే ఇంకా న్యాచురల్ గా ఉండేది. కధనం (స్క్రీన్ – ప్లే) గ్రిప్పింగ్ గా ఉంటే ప్రేక్షకులు ఇలాంటివి పట్టించుకోరు, కానీ సీన్స్ స్లో గా నడుస్తుంటే మాత్రం, చేసే ప్రేక్షకుల దృష్టి ఎలాంటి టెక్నికల్ మరియు లాజిక్స్ మీదకు పోతుంది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు సాయి కిరణ్ దైద విషయానికి వస్తే..తాను ఈ సినిమాకు తాను అనుకున్న, వ్రాసుకొన్న కాన్సెప్ట్  పేపర్ మీద బాగానే ఉండవచ్చు కానీ అదే కధను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరమీద ప్రెజెంట్ చేయడం లో కొంచెం దారి తప్పాడు అని పిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది.

ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. తెలుగు ప్రేక్షకులకు అర్దం కానీ, తెలియని, ఎప్పుడు వినని భాషలో ప్రార్దన చేయించడం కధగా వినడానికి బాగానే ఉన్నా తెరమీద ఆ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోయారు.

శ్రీరామ్ ఖుషి రవి లు, ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో కనిపించి  సాలిడ్ పెర్ఫామెన్స్ లని అందించారు. హీరో హీరోయిన్ అనే కంటే నటి నటులుగా మంచి నటనతో మెప్పించారు.  ఒకరికి ఒకరు పోటీపడి నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇంకా వీరితో పాటుగా శ్రీరామ్ ఖుషి రవి లకు పిల్లలుగా నటించిన  బేబీ చైత్ర, బేబీ లీషా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చిన్న కూతురుగా కనిపించిన చిన్నారి అయితే సినిమాలో ఆశ్చర్య పరుస్తుంది. చాలా నాచురల్ గా మంచి ఎమోషన్స్ ని అలవోకగా తాను పండించింది.

అలాగే నటి ఈశ్వరీ రావు ఓ తాంత్రికురాలుగా సెటిల్డ్ నటనను  అందించారు. తన వాయిస్ మాడ్యూలేసన్ కూడా చాలా చక్కగా ఉంది.

ఇంకా ముఖ్య పాత్ర లో నటించిన అవసరాల శ్రీనివాస్, రవివర్మ, విజయలక్ష్మి, శ్రీలత కూడా తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ బాగా నటించారు.

Pindam movie review by 18F movies 1

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ సూరంపల్లి ఈ పిండం సినిమాకి చేసిన బాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) చాలా బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని సీన్స్ కి అయితే మ్యూజిక్ డిజైన్ వలనే అంత బాగా ఇంపాక్ట్ ఇవ్వగలిగింది. పిండం టైటిల్ సాంగ్ కూడా బాగానే ఉంది.

సతీష్ మనోహరన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హర్రర్ మరియు థ్రిల్స్ సీన్లకు మూడికి తగ్గ లైటింగ్ ఫెటర్న్ తో చక్కగా ఉంది. విజువల్ క్వాలిటి ఇంప్రెస్వ్ వ్ గా  చక్కగా ఉంది. సినిమా లో ఎక్కువ బాగం నైట్ ఘాట్ కాబట్టి క్రియేటివ్ లైటింగ్ ఎఫెక్ట్స్ తో పనిచేసే ఆపర్చునిటీ సినిమాటో గ్రాఫర్ కి దొరికింది అని చెప్పవచ్చు.

శిరీష్ ప్రసాద్ అందించిన ఎడిటింగ్ ఒకే లా ఉంది. వంక కొంచెం బెట్టర్ గా చేసి ఉండవలసింది. అక్కడక్కడా విజువల్ జంప్ కనిపిస్తుంది. ఇంకా సినిమా కి వాడిన వి ఎఫ్ ఎక్స్ చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇంకా కొంచెం బడ్జెట్ తో ఇంకా బెటర్ గా చేయాల్సింది.

యంగ్ & డెబ్యూ నిర్మాతలు యశ్వంత్ దగ్గుమాటి, ప్రభు రాజా పాటించిన నిర్మాణ విలువలు ఒకే. ఇలాంటి పిరియాడిక్  కధలను ఇంకొంచం ఎక్కువ బడ్జెట్ తో బెట్టర్ గా చేయాలి.

Pindam movie Team 1

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఈ  “పిండం” చిత్రం లో చూపినట్టు నెగిటివ్ ఎనర్జీ, పాసిటివ్ ఎనర్జీ లా చెప్పుకోవాలి అంటే ముందు గా పిండం సినిమా కి ఉన్న పాసిటివ్ ఎనర్జీ గురించి చెప్పుకుంటే, ఈ చిత్ర కధ పాతదే అయినా దర్శకుడు రాసుకొన్న కధనం తో కొంత క్యురసిటీ కలుగుతుంది.  ఇంకా  మెయిన్ లీడ్ నటీనటులు అయిన శ్రీరామ్ , ఖుషి రవి, ఈశ్వరీ రావు మరియు అవసరాల శ్రీనివాస్ తమ ప్రామిసింగ్ నటనతో ప్రేక్షకులను కధలో లీనమయ్యేలా చేశారు.

అలాగే కొన్ని సీన్స్ లో వచ్చే థ్రిల్ ఎలిమెంట్స్ కి సినిమాటోగ్రఫీ  బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవం పోసి జీవ-పిండం గా మార్చివేశాయి అని  చెప్పవచ్చు.  ఈ సినిమాకి పనిచేసిన మెయిన్ టెక్నిసియన్స్ అయిన దర్శకుడు, సినిమాటో గ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినా, సిన్మా చూసే ప్రేక్షకులకు అలా అనిపించదు. ఎందుకంటే వారు చాలా ఎక్స్పెరియన్స్ ఉన్న వారిలా చేశారు.

పిండం సినిమా కధలో  నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పుకోవాలి అంటే మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్సి) కంటే రెండవ అంకం (సెకండ్ ఆఫ్) కొంత స్లో గా సాగదీతగా సాగుతుంది అనిపించింది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ రెగ్యులర్ సినిమా ఫార్మెట్ లోనే సాగగాయి.  ఇంకా బడ్జెట్ లిమిట్ వాలనో ఏమో కానీ, కధ లో వ్రాసుకొన్న 8  లేదా పది పాత్ర దారులు తప్ప ఎంక ఎవరు కనపడారు. ఒకే చోట మొత్తం సినిమా చుట్టేసినట్టు ఉంటుంది. ఊరులో కొందరు జనాలు, వీదులలో కొందరు, రైస్ మిల్లులో మరి కొందరు వర్కర్స్ ని చూపిస్తే ఇంకా థ్రిల్ గా సాగేది.  డైరెక్టర్ మీద హాలీవుడ్ హర్రర్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే మాక్షిమమ్ హాలీవుడ్ హర్రర్  సినిమాలు  తక్కువ పాత్రలతో ఒకే బంగ్లా లో జరుగుతుంటాయి.

Pindam movie review by 18F movies 2

ఓవరాల్ గా  నెగిటివ్ ఎనర్జీ కంటే పాసిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండుట వలన పిండం సినిమా హర్రర్ జోనర్ ప్రేక్షకులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమా లు దియేటర్స్ లో మాత్రమే చూసి ఎంజాయ్ చేయగలము.

చివరి మాట: గుండెలు పిండేసే పిండం !

18F RATING: 3 / 5

   * కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *