Pindam Movie song launch: అనిల్ రావిపూడి చేతుల మీదుగా జీవ పిండం గీతం విడుదల !

IMG 20231109 WA0050 e1699509275372

 

పాటను ఆవిష్కరించిన అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “పిండం చిత్ర టీజర్ చూశాను, అద్భుతంగా ఉంది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఉంది. మంచి ఆర్టిస్ట్ లు, మంచి టెక్నీషియన్స్ కలిసి పని చేసిన చిత్రమిది. శ్రీరామ్ గారు చాలారోజుల తర్వాత మళ్ళీ కథానాయకుడిగా చేస్తున్నారు. శ్రీరామ్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, ఖుషి మరియు మిగతా ఆర్టిస్ట్ లు అందరూ చాలా బాగా చేశారు.

ఈ చిత్రంలోని జీవ పిండం సాంగ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. సాంగ్ కూడా చాలా బాగుంది. పాటలోనే కథ ప్రయాణం ఎలా ఉండబోతుందో చెప్పారు. ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమాని చూసి మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.” అన్నారు.

IMG 20231109 WA0051

కృష్ణ సౌరభ్ సూరంపల్లి స్వరపరిచిన “జీవ పిండం బ్రహ్మాండం” అంటూ సాగిన పాట రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అద్భుతమైన సంగీతంతో కృష్ణ సౌరభ్ మనల్ని పిండం ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. కవి సిద్ధార్థ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పాటలోని ప్రతి పంక్తిలో లోతైన భావం ఉంది. “మరణం చివరి చరణం కాదు.. జననమాగిపోదు”, “ఏ పాపము సోకదు అమ్మలో.. ఏ దీపము మగలదు ఆమెలో” వంటి పంక్తులలో కవి సిద్ధార్థ తన కలం బలం చూపించారు. ఇక అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. మొత్తానికి ఈ పాట పిండం చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది.

IMG 20231108 WA0173

 

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

తారాగణం:

శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు

సాంకేతిక వర్గం: 

కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ,డీఓపీ: సతీష్ మనోహర్,సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి,ఆర్ట్: విష్ణు నాయర్,ఎడిటర్: శిరీష్ ప్రసాద్,కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ,పోరాటాలు: జష్వ,పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి,లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స,సహ నిర్మాత: ప్రభు రాజా ,సమర్పణ: ఆరోహి దైదా,నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *