Pindam Movie censor completed & Release date locked: ‘పిండం’ సిన్మా సెన్సార్ పూర్తి, విడుదల ఎప్పుడంటే? 

IMG 20231118 WA0089 e1700387440123

 

* సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పిండం’

* ‘పిండం’ చిత్రం చూసి థ్రిల్ అయిన సెన్సార్ సభ్యులు

* డిసెంబర్ 7న వైవిధ్య భరితంగా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

 

హారర్ జానర్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. అయితే మన దగ్గర పూర్తిస్థాయి హారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. కొన్ని చిత్రాలలో రొమాంటిక్ లేదా కామెడీ ట్రాక్ ల వల్ల హారర్ మోతాదు తగ్గిపోతుంది. అలాంటి ట్రాక్ ల జోలికి పోకుండా, కేవలం ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది.

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన హారర్ అనుభూతిని అందించడానికి రాబోతుంది.

IMG 20231112 WA0107

సెన్సార్ పూర్తి, అభినందనలు అందుకున్న చిత్ర బృందం: 

తాజాగా ‘పిండం’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి థ్రిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈస్థాయిలో భయపెట్టిన హారర్ చిత్రాన్ని చూడలేదని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు, తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ అద్భుతంగా రూపొందించారని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

డిసెంబర్ 7న ప్రీ రిలీజ్ వేడుక:

హైదరాబాద్ లో డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం ‘పిండం’ ప్రీ రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకను ఆద్యంతం ఆసక్తికరంగా, విభిన్న రీతిలో, సినిమా కు తగినట్లుగా సరికొత్త అనుభూతిని కలిగించేలా ప్లానింగ్ చేస్తున్నారు చిత్ర బృందం.

హారర్ జానర్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పిండం’ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

IMG 20231119 WA0131 1

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ‘పిండం’ అనేది ఓ కంప్లీట్ హారర్ చిత్రంగా రూపొందింది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని, ఒంటరిగా కూర్చొని ఈ సినిమాని చూడలేరని చిత్ర బృందం చెబుతోంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

తారాగణం:

శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు..

 

సాంకేతిక వర్గం: 

కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ,డీఓపీ: సతీష్ మనోహర్,సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి,ఆర్ట్: విష్ణు నాయర్,ఎడిటర్: శిరీష్ ప్రసాద్,కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ,పోరాటాలు: జష్వ,పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి,లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స,సహ నిర్మాత: ప్రభు రాజా ,సమర్పణ: ఆరోహి దైదా,నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *