“సాత్విక జంపా” విశాఖపట్నం లో పుట్టి హైదరాబాద్ లో పెరిగింది. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో బికామ్ కంప్లీట్ చేసింది మన తెలుగు అమ్మాయి.
మోడలింగ్ మీద ఆసక్తి తో కెరీర్‌ను ప్రారంభించి, తెలుగు సినిమాల్లో హీరోయిన్ దశ గా దూసుకెళ్తుంది.
ఈ ముద్దు గుమ్మా ని చూస్తే మన తెలుగు అమ్మాయేనా అంటారు. పెద్ద హీరోయిన్స్ ని తలదన్నేలా హాట్ కేక్ లా ఉంటుంది ఈ సాత్విక జంపా. కావాలంటే, మీరు ఒకసారి లుక్ వేయండి.
ఇంస్టాగ్రామ్ లో చురుగ్గా ఉంటు ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వుతుంది ఈ తెలుగు భామ.
హీరోయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కళలు కంటున్నా ఈ తెలుగు బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకోవాలని, ఇదే నా ముందున్న అతిపెద్ద ఆశయం మరియి ఛాలెంజిగ్ అంటుంది.
సినిమా ఇండస్ట్రీ లో నాని మరియు ప్రకాష్ రాజ్ ఇద్దరు అంటే ఎంతో ఇష్టమని తెలియ చేస్తూ మరియు తమన్నా టాలెంట్ కి నేనెప్పుడూ ఫిదా అవుతాను అంటుంది ఈ ముద్దు గుమ్మా.
ఇటీవల అంటే సుందరానికి, RRR, సీతా రామం మూవీస్ చూసి అద్భుతంగా ఉన్నాయని తెలియచేసింది. భవిష్యత్తులో, తెలుగు హీరోయిన్ గా నటించి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటు…..
ఈ భామకి మన తెలుగు డైరెక్టర్లు, తెలుగు హీరోయిన్స్ కి అవకాశం ఇవ్వాలని, ఇలాంటి ప్రతిభావంతులైన టాలెంట్ ని మన మందరం ఎంకరేజ్ చేయాలనీ మన 18F తరుపున ఆల్ ది బెస్ట్ తెలియచేద్దాం.