మాళవిక మోహనన్ (Malavika Mohanan): మాళవిక కేరళలో పుట్టి పెరిగి చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుని స్కూల్ దశలోనే నాటకలపై కూడా ఆసక్తిని పెంచుకొని ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాణించింది.

ఇక కేరళలో ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ఉన్నత చదువులను కొనసాగిస్తూ అక్కడ నుండే వెండి తెర హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అని మొదట మోడల్ గా తన కెరీర్ ను ముంబై లో స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం మాళవిక మోహనన్ ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు కానీ ఇంకా ఏది ఫైనల్ కాలేదు , ఇక కంటెంట్ బాగుంటే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తాను అని ఈ బ్యూటీ ఇదివరకే మీడియా లో క్లారిటీ ఇచ్చింది.

గత ఏడది మాళవిక ధనుష్ తో మారన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఆమెకు నటిగా అయితే మంచి గుర్తింపును అందించింది అంటున్నారు కోలి వుడ్ సోదరులు.

విజయ్ విజయ్ సేతుపాటి నటించిన మాస్టర్ సినిమా సక్సెస్ కావడంతో మాళవికకు ఇటు తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ కమర్షియల్ గా ఉండే గ్లామర్ రోల్ ఆఫర్స్ ఎక్కువగా రావడంతో వాటిని చేయడానికి ఒప్పుకోలేదు అంటున్నారు ఆమె పర్సనల్ స్టాఫ్.

ఇక కరొన కు ముందు 2019లో మాళవిక కు కార్తీక సుబ్బరాజు దర్శకత్వం లో రజనీకాంత్ తో నటించే అవకాశం దొరికింది. రజినీకాంత్ తో పేట సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా రేఫెరెన్స్ తోనే విజయ్ తో మాస్టర్ లో నటించే అవకాశం కొట్టేసింది.

మరో పక్క మలయాళం లో మాళవికకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మిగతా ఇండస్ట్రీలో కూడా విభిన్నమైన ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది.

మిగిలిన కన్నడ హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా ఆమె తొందరగానే సినిమాలు చేయడానికి ప్రణాళికలు వేసుకొంటుంది. ఇక మాళవిక మొదటగా 2013లో ఒక మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది. ఇక ఆమె మొదటి సినిమా సక్సెస్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చినప్పటికీ కంటెంట్ నచ్చితేనే సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది.

చిన్న వయసులోనే చదువుకొనే టైమ్ లో మాళవిక మోహన్ కు తమిళ్ మలయాళం లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆమె తొందర పడకుండా చదువును పూర్తి చేసిన తర్వాతనే సినిమాలలో కొనసాగాలని అనుకుంది, అలానే చేసింది.

మాళవిక మోహన్ ముంబై లో ఒకప్పుడు చదువుకుంటూనే మరొకవైపు మోడలింగ్ ప్రపంచంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక తర్వాత ఆమెకు చాలా తొందరగానే సినిమా పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి అని చేపవచ్చు.
