మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి పెరిగింది మాత్రం కేరళలో కానీ తెలుగు లో మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది.

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసింది కీర్తి సురేష్.

మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీతో మహానటి అని పేరు తెచ్చుకుంది.

మహా నటి తర్వాత తెలుగు సినిమాల్లో గ్లామర్‌కు తావివ్వకుండా పెద్ద హెరోల సరసన సినిమాలు చేస్తూ మంచి పేరు డబ్బు సంపడిస్తుంది కీర్తి సురేష్.

కొన్ని సినిమాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయాయి . రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా, బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది.

గ్లామర్ రోల్స్ లోనే కాకుండా మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలను కూడా ఎంపిక చేసుకొని నటించి మెప్పించింది.

అలాగే గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్.

అప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు కాస్తా స్లిమ్ అయి.. గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా కీర్తి సురేష్ పెట్టిన ఫొటోలే ఉదాహరణ. ఇందులో స్టైలిష్ వేర్లో మత్తెక్కేలా చూస్తూ వయ్యారాలు పోయింది కీర్తి సురేష్.

నెట్ జాళి వంటి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న కీర్తి సురేష్ ఘాటుగా పోజులిచ్చింది. తన మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు గాయాలు చేసేలా ఉంది.

తన గ్లామర్ తో, అందంతో యూత్ కు నెట్ విసురుతున్నట్టు గా చూస్తోంది ఈ మహానటి ఫేమ్.