సినీ రంగంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు టాలెంట్ ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్లుగానే సక్సెస్ మంత్రా కూడా తెలియాలి. ఇది లేకనే ఎంతో మంది అమ్మాయిలు పెద్దగా సక్సెస్ లేకపోతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాలిసింది మన తెలుగు అమ్మాయిలు.
మన తెలుగు అమ్మాయి లిస్టులో “ఈషా రెబ్బా” కూడా ఉంది. టాలెంట్ ఉన్నా ఈషా రెబ్బాకు లక్ లేక అవకాశాలను అందుకోలేకపోతుందా? లేదంటే, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను సొంతం చేసుకోలేకపోతోందా? అనేది ఆ పై వాడికి తెలియాలి. కానీ, ఈషారెబ్బా అంటే దునియా లో తెలియనోడు అంటూ ఎవ్వరు లేరు..!! ఎందుకంటే, మేడం కళ్ళు, స్మైల్ చూస్తే మళ్ళి మళ్ళి చూడాలనిపించేలా ఉంటుంది..! ఏదైమైనా సరే, ఈ సారి గట్టి హిట్ కొట్టాలని మా 18ఫ్ టీం తరుపున బలంగా కోరుకుంటుంది.

ఇకపోతే, మోడలింగ్ రంగంలో తన అందచందాల అరబోతలో మెరిసిపోయిన ఈషా రెబ్బాకు విశేషమైన గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసి, చాలా ఫేమస్ అయిన తర్వాత..

శేఖర్ కమ్మల అందరూ కొత్తవారితో తీసిన సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ లో నటిగా పరిచయం అయింది. తర్వాత ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కింది.

ఈ సినిమా డీసెంట్ హిట్‌గా నిలవడంతో ఆమెకు మంచి స్టార్ట్ లభించింది. ఫలితంగా సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.
తెలుగు అమ్మాయి అనే బ్రాండ్ తో పాటు కాస్త మోడెలింగ్ టచ్ ఉండడం తో ఈషా రెబ్బాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు.

దీంతో ఆమె వరుసగా ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాలు చేసింది.

అన్నీ చిన్న సినిమాలు కావడం, అనుకున్న కథలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం వలన హీరోయిన్‌గా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది ఈషా రెబ్బా.. ఎవ్వరు ఊహించని విధంగా కథ నచ్చితే సెకెండ్ లీడ్‌గా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో భాగంగానే ‘అరవింద సమేత.. వీరరాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఆకాశమంత వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది.

కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు అమ్మడు ఈషా రెబ్బా.. సమయం కుదిరినప్పుడల్లా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది.

ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ లోను తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది.