భారత దేశ సినిమాచరిత్ర లో పుడమి దీవిలో అతిలోకసుందరిగా ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె నట వారసురాలిగా వచ్చిన జాన్వీ కపూర్ అదే తరహాలో క్రేజ్ అందుకోవాలని అనుకుంటుంది.
జాన్వి కపూర్ తన సినీ నటన విషయంలో, సినిమా కధల వేన్నిక విశయం లో మొదట్లో కొంత ట్రోలింగ్ బారిన పడింది. జాన్వి కి నటించే విధానం కూడా తెలియదు అని చాలా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమె కొంత అయోమయం లో పడింది.
జాన్వీ కపూర్ నటించిన మొదటి సినిమా దడక్ తర్వాత నటిగా నాలుగైదు సినిమాలు చేసిన కూడా ఇంకా ఒక స్టూడెంట్ తరహాలోనే నేర్చుకుంటున్నాను అని మొన్ననే హైదరాబాద్ మీడియా తో మాట్లాడుతూ చెప్పింది.
జాన్వీ కపూర్ కి తను నటించిన సినిమాలు నిరాశ పరుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెను తిరిగి చూడ కుండా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మిలి సినిమా తర్వాత తన చేతిలో మరో రెండు సినిమాలు అయితే ఉన్నాయి. అలాగే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో కూడా ఆమె ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇంకా తన స్వంత ప్రొడక్షన్ హౌస్ లో కూడా మంచి కధల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను తన గ్లామర్ చూపిస్తూ ఎన్నో ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఇంస్టా లో అయితే ఆమె ఫాలోవర్ల సంఖ్య అమితంగా పెరిగిపోయింది.
జాన్వి కపూర్ హీరోయిన్ గా తనను తాను నిరూపించుకోవడానికి మొదటి నుంచి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెల్లమెల్లగా తను యాక్టింగ్ విషయంలో కూడా అనేక రకాల మార్పులు తీసుకొస్తోంది.
ఇటీవల కాలంలో జాన్వి కపూర్ నటన కొంత మెరుగయింది అని ఓవర్గం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తుంది. తన గ్లామర్ విషయంలో అయితే ఆమె నేటి తరం అగ్ర హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది జాన్వి కపూర్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అయితే అందులో గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి లో రాగా.. మలయాళ సినిమా ఆధారంగా హిందీ లో మిలి చేసి థియేటర్లలో విడుదల చేశారు. కానీ మిలి సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది.
జాన్వి కపూర్ నటించిన ఓటిటి రిలీజ్ గుంజన్ సక్సేన బయోపిక్ సినిమా లో నటన లో పరవాలేదు అనే విధంగా నటించింది. ఆ సినిమాలో ఆమె నటించిన విధానానికి కొంత మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం జాన్వి కపూర్ షేర్ చేసిన పిక్స్ లో అప్పట్లో శ్రీదేవి రూప్ కా రాణి సోలొంకా రాజా సినిమా లో డ్రస్ లాంటి డ్రస్ తో తన అందాలను అరబోసింది. జాన్వి కపూర్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే రావడం లేదు. మొదట్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా ఓటీటీ లోనే విడుదలయ్యాయి.
ప్రస్తుతం జాన్వి కపూర్ తండ్రి, శ్రీదేవి భర్త అయిన బోని కపూర్ సౌత్ లో జాన్వి కపూర్ ని పరిచయం చేయాలని టాప్ డైరెక్టర్, హీరో ల కధలు వింటున్నారు. ఇంకా ఏది ఫైనల్ కాలేదు.
ఎన్టిర్ కొరటాల శివ సినిమాలో జాన్వి కపూర్ నటిస్తుంది అని మీడియా లో వార్తలు వచ్చినా, అదే విశయాన్ని ఈ మద్య మిలి సినిమా కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు బోని, జాన్వి ని అడిగితే, ఇంకా ఏది ఫైనల్ కాలేదు అంటూ దాతవేశారు.
సొ, సోషల్ మీడియా యూత్ అంతా జాన్వి సినిమా లు హిట్ కాకపోయినా తన షేర్ చేస్తూన్న హాట్ ఫోటో లతో ఎంజాయ్ చేస్తున్నారు.