చిత్రం: పేకమేడలు,
రిలీజ్ డేట్: 2024-07-19,
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు..,
రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల,
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్,
నిర్మాత: రాకేష్ వర్రే,
మ్యూజిక్ డైరెక్టర్ : స్మరణ్ సాయి,
డీవోపీ: హరిచరణ్ కే,
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
మూవీ: పేకమేడలు రివ్యూ ( Pekamedalu Movie Review)
తమిళ, మలయాళం నుండే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తాయి, మన తెలుగులో అలాంటి సినిమాలు తియ్యారు అనేవారికి క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ లో వర్ధమాన నటుడు రాకేశ్ వర్రే నిర్మించిన పేక మేడలు గొప్ప ఉదాహరణ.
మన తెలుగులో కూడా ఇటీవల ఇలాంటి రూటేడ్ కధాలకు మంచి ఆదరణ లాబిస్తుంది. అప్పట్లో ఎవరికి చెప్పొద్దు అంటూ మంచి రూరల్ కధతో రాకేశ్ వర్రే హీరోగా నటించి నిర్మించి ఆధారణ పొందారు. కొంత గాప్ తర్వాత ఇప్పుడు వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా, నీలగిరి మామిళ్ల దర్శకత్వం లో `పేకమేడలు` అనే సినిమా నిర్మించి ఈ శుక్రవారమే విడుదల చేశారు.
మరి ఈ పేకమేడలు చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం రివ్యూలో చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
లక్ష్మణ్ (వినోద్ కిషన్) బిటెక్ చదివి గాలిలో మేడలు కడుతూ, జాబ్ చేయడం చేతకాక రియల్ ఎస్టేట్ అంటూ దోస్తులతో కలిసి బలాదూర్ గా కాలక్షేపం చేస్తుంటాడు. ఆయనకు భార్య వరలక్ష్మి(అనుష కృష్న), ఆరు సంవత్సరాల కొడుకు ఉంటాడు. లక్ష్మణ్ ఫ్యామిలీని ఇంటిని పట్టించుకోడు. బస్తీలో ఉంటూ ఫ్రెండ్స్ తో రోజూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.
మాటలతోనే మేడలు కడుతూ, ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి జల్సాలు చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా కోట్లు సంపాదించాలనుకుంటాడు. మరోవైపు భార్య చిన్నా చితకా పనులు చేసి వచ్చిన దానితో కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె కర్రీ పాయింట్ పెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం కొంత డబ్బు కావాలని భర్త లక్ష్మణ్‌ని అడగ్గా, ఏదోలా మ్యానేజ్ చేస్తానని చెబుతాడు.
ఇంతలో ఓ ఎన్‌ఆర్‌ఐ లేడీతో పరిచయం క్లోజ్‌గా మారి తన మాయమాటలతో ఆమెని తన బుట్టలో వేసుకుంటూ రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టించి కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఆమెతో ఫిజికల్‌గానూ కలుస్తాడు. ఎన్‌ఆర్‌ఐ లేడీ లక్ష్మణ్‌కి క్లోజ్ అయి అతనితోనే ఉండాలని, భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. మరోవైపు ఆ ఎన్‌ఆర్‌ఐ లేడీ మోజులో పడ్డ లక్ష్మణ్ కూడా తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత..
బిటెక్ లక్ష్మణ్ కష్టపడకుండా సోమరిగా మారడానికి కారణం ఏమిటి?,
బిటెక్ లక్ష్మణ్ లత్ కోర్ లక్ష్మణ్ గా మారడానికి కారణం ఏమిటి ?,
బస్తీ జీవితంలో లక్ష్మీ ఎలాంటి కష్టాలు పడింది?,
భర్త చేసే పనుల వల్ల లక్ష్మీ ఎలాంటి కస్టాలు పడింది?,
తన భర్త జీవితంలోకి మరో మహిళ రావడంతో లక్ష్మీ పరిస్థితి ఏమిటి?,
ఎన్నారై మహిళతో రిలేషన్ ఫలితం ఏమిటి?,
పుట్టింటికి వెళ్లిన లక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది?
లక్ష్మీ, లక్ష్మణ్ కాపురం చివరకు ఏమైంది?,
ఎన్నారై మహిళతో లక్ష్మణ్ రిలేషన్ ఎంత వరకు వచ్చింది? ,
చివరకు లక్ష్మణ్‌లో వచ్చిన మార్పేంటి?, చివరగా ఇచ్చిన ట్విస్టేంటి?
అనే ప్రశ్నలు ఇంటరెస్ట్ గా అనిపించి జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే ం దగ్గరలొని దియేటర్ కి వెళ్ళి చూడండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
పేక మేడలు సినిమాలో కధ తో పాటూ కధనం కూడా అనవసరమైన అంశాలకు పోకుండా ఏది ఎంత కావాలో, అంతే కధనం (స్క్రీన్ – ప్లే) తో రూపొందించారు దర్శకుడు. అయితే మధ్య మధ్యలో కొంత స్లోగా సాగడం, లక్ష్మణ్ ప్రవర్తనని, ఆయన కొట్టే బిల్డప్‌లను కాస్త ఎక్కువగా చూపించడం సాగదీతగా అనిపిస్తుంది.
సినిమాలో చాలా వరకు హ్యూమర్ కి స్కోప్ ఉన్నా కానీ దర్శకుడు ఆ యాంగిల్‌ని వాడుకోకుండా సీరియస్ టోన్ లోనే సీన్స్ ని తీయడం వలన సినిమా చాలా వరకూ హార్డ్ గానే వెళ్తుంది. మరోవైపు తెలుగు ప్రేక్షకులకు హీరో హీరోయిన్ కొత్త కాస్టింగ్ కావడంతో కనెక్ట్ అవడానికి టైమ్ పడుతుంది. కానీ రియలిస్టిక్ సీన్లు వాటిని డామినేట్ చేస్తాయని చెప్పొచ్చు.
క్లైమాక్స్ మాత్రం సాదాసీదా ముగింపులా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఏదైనా సర్‌ప్రైజింగ్ అనిపించే సీన్ పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా గ్రామీణ , పట్టణ బస్తీ లలో జరిగే సంఘటన తో ఓ రియల్ లైఫ్‌ని వెండితెరపై చూపించే ప్రయత్నమే ఈ `పేకమేడలు`.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు నీలగిరి మామిళ్ల చాలా న్యాచురల్ కధ తో సినిమాని తెరకెక్కించిన తీరుని బాగుంది. ఆయన కధా రచన డీవియేట్ కానీ కథనం (స్క్రీన్ – ప్లే ) సినిమాకి పెద్ద ప్లస్. పైగా ఆర్టిస్ట్ ల ఎంపిక, వారి నటన డైరెక్షన్ ప్రతిభని తెలియజేస్తుంది. చాలా సన్నివేశాలను చాలా డిటెయిలింగ్‌గా చెప్పడం, గ్రామీణ, బస్తీల్లో చోటు చేసుకునే సంఘటనలను సైతం అంతా బాగా వెండితెరపై ఆవిష్కరించడం దర్శకుడు ప్రతిభకి నిదర్శనంగా నిలుస్తాయి
నటుడు వినోద్ కిషన్ చాలా బాగా చేశాడు. లక్ష్మణ్ పాత్రలో ఒదిగిపోయాడు. కాస్త ఇన్నోసెంట్‌గా, ఇంకాస్త కన్నింగ్‌గా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ తన సహజ నటనతో మ్యాజిక్ చేశాడు. వినోద్ కిషన్ కి లక్ష్మణ్ లో నటించడానికి ఎక్కువ స్కోప్ దొరికింది.
అనుష కృష్ణ వరలక్ష్మి పాత్రలో లుక్, నటన చాలా రియలిస్టిక్‌గా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే వరం పాత్రలో జీవించి ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్లని, యాక్షన్ సీన్స్ ని అంతే బాగా చేసి మెప్పించింది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ బాగా రక్తికట్టింది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది.
ఎన్ఆర్‌ఐ లేడీగా రేతికా శ్రీనివాస్ కూడా పాత్ర పరిది మేరకు బాగా చేసింది. వీరితోపాటు జగన్ యోగిరాజ్, గణేష్ తిప్పరాజు, నరేష్ యాదవ్‌లు కూడా బాగా చేశారు. మిగిలిన పాత్రలు సైతం ఆకట్టుకునేలా, సహజంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన వారంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే, కానీ వారందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకొనే ప్రయత్నం చేశారు
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. బూమ్ బూమ్ లచ్చన్న అనే ట్యూన్ బాగా పాపులర్ అయ్యింది. మ్యూజిక్‌తోపాటు బిజీఎం కూడా చాలా బాగుంది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో BGM కీలకభూమిక పోషించింది. కథలో భాగంగా వచ్చే పాటలు ఆకట్టుకుంటూ హృదయాన్ని టచ్ చేసేలా ఉన్నాయి.
హరిచరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కథకి తగ్గట్టుగానే నేచురల్‌గా ఉంది. బస్తీ సన్నివేశాలు, నటుల సహజ ఎమోషన్స్ ని బాగా క్యాప్చర్ చేశాడు అని చెప్పవచ్చు.
ఎడిటర్ సృజన అడుసుమిల్లి, హంజా అలీ ల ఎడిటింగ్ కూడా బాగుంది. చాలా సీన్స్ సహజంగా ఉన్నాయి. మొదటి అంకం లొని కొన్ని స్లో సీన్స్ ని ఇంకా ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కానీ, ఇప్పటికే సినిమా నిడివి 120 మినుట్స్ కాబట్టి ఉన్నంతలో బాగానే క్రిస్ప్ గా చూపించే ప్రయత్నం చేశారు.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. కాన్సెప్ట్ మూవీ కావడంతో బడ్జెట్ తక్కువే అవే ఛాన్స్ ఉన్నా, ఈ మూవీ విషయంలో రాకేష్ వర్రే రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
రాకేష్ వర్రే స్వంత నిర్మాణ సంస్థ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ని ఇలాంటి రూటేడ్ కధ తో సినిమా తీసినందుకు అబినందించాలి. హంగులు, ఆర్బాటాలు లేకుండా కేవలం కంటెంట్ ప్రధానంగా, విమెన్ ఎనపోర్మెంట్ అనే సోషల్ మెసేజ్ తో సాగే నేటివిటి సినిమా పేకమేడలు. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలు, కాపురంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను చెప్పే ఎమోషనల్ కథ ఇది.
ఈ సినిమాలోని పాత్రలు తీరు కథలోని నిజాయితీ ని వెలికితీస్తుంది. పాత్రలకు తగ్గట్టుగానే నటులు కూడా సహజంగా నటించి మెప్పించారు. దర్శకుడుగా నీలగిరి తొలి చిత్ర ప్రయత్నం లోనే సమాజం లొ అనగారిపోతున్న మహిళల జీవన పోరాటం ఇతి వృత్తంతో చెప్పడం బాగుంది.
లాభ నష్టాలను చూడకుండా మంచి మెసేజ్ ఉన్న కధ చెప్పాలి అని నిర్మాతగా రాకేశ్ వర్రే చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే డెఫినెట్‌గా మంచి అనుభూతిని పంచుతుంది.
సంసారం సాగరం లో భర్త అహంకారం తో భాధలు అనుభవిస్తున్న ప్రతి మహిళా కనెక్ట్ అయ్యే కధ. ప్రతి మహిళా తప్పక చూడవలసిన చిత్రం ఈ పేక మేడలు.
చివరి మాట: మహిళా స్వశక్తి ని తెలిపే గొప్ప చిత్రం !