Peddhakapu Heroine Pragathi Special Interview: పెదకాపు లో ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినదుకు శ్రీకాంత్ అడ్డాల కు థాంక్స్ !

pragathi Peddhakapu heroine e1695702231276

యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

సెప్టెంబర్ 29న పెదకాపు-1 చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ మా 18F మూవీస్ విలేకరి తో ప్రత్యేక సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు. ఆ విశేశాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము .

pragathi interview e1695702262195

పెదకాపు 1 కథ విన్నప్పుడు ఏం అనిపించింది ?

పెదకాపు కథ శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్ తో చాలా క్యాచీగా అనిపించింది. పెదకాపు కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది.

ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

‘పెదకాపు’ నాకు రీఇంట్రడక్షన్ అని చెప్పాలి. ఇంతకుముందు మనుచరిత్ర అనే సినిమా చేశాను. తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో ముంబై వచ్చేశాను. తర్వాత ఈ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?

పెదకాపు లో నా పాత్ర చాలా కీలకంగా వుంటుంది. నా పాత్రే కాదు ఇందులో వుండే దాదాపు పాత్రలన్నీ కథలో చాలా కీలకంగా వుంటాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలు చూశాను. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బలంగా వుంటాయి. ఇందులో కూడా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది.

pragathi Peddhakapu heroine 2 e1695702287678

పెదకాపు లాంటి రా రస్టిక్ సినిమా చేయడం ఎలా అనిపించింది ?

ఒక నటిగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. ఇలాంటి సవాల్ తో కూడిన పాత్రలు చేయడం ఒక నటిగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి రూరల్ పాత్రని ఇంత యీజ్ తో చేస్తానని అనుకోలేదు. ఈ పాత్ర చాలా సహజంగా వచ్చింది. ఈ క్రెడిట్ దర్శకుడు శ్రీకాంత్ గారికి దక్కుతుంది. ఈ పాత్రలో అన్ని ఎమోషన్స్ వున్నాయి.

షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ?

పెద్దగా సవాళ్ళు లేవనే చెప్పాలి. ఎందుకంటే ముందే వర్క్ షాప్ చేశాం. ముందుగానే రీసెర్చ్ చేసుకున్నాం. స్టయిలింగ్ టీం కూడా అద్భుతంగా పని చేసింది. శ్రీకాంత్ గారు ప్రతి పాత్ర విషయంలో ముందే క్లారిటీ గా చెప్పారు. ఆ పాత్ర ఏం చేస్తుందో తెలుసు కాబట్టి అందులో జీవించే అవకాశం దొరికింది. డైరెక్షన్ టీం చాలా హార్డ్ వర్క్ చేసింది.

pragathi Peddhakapu heroine 1 e1695702310310

విరాట్ కర్ణ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

విరాట్ కర్ణ చాలా సపోర్టివ్ కోస్టార్. ఈ సినిమాలో తన పాత్ర ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో అందరూ కనెక్ట్ అవుతారు. తన పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా వుంటుంది.

ఇండస్ట్రీలో రావడానికి ఫ్యామిలీ ప్రోత్సాహం ఉందా ?

మొదట్లో అస్సలు లేదు( నవ్వుతూ). నేను లా, పబ్లిక్ పాలసీ చదివాను. అలాగే కొంచెం ఇంట్రోవర్ట్.(నవ్వుతూ) చిన్నప్పటినుంచి ఇంట్లో సినిమా వాతావరణం లేదు. సినిమాల్లోకి వెళతానని చెప్పిన తర్వాత మొదట్లో ఇంట్లో అంతా వద్దు అనే అన్నారు. రెండు రోజులు ఏడ్చాను కూడా (నవ్వుతూ). చివరికి కాంట్రాక్ట్ సైన్ చేసేసానని నాన్నకి చెప్పాను. ‘’సైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం.. నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు( నవ్వుతూ).

ఐతే నటన కొనసాగిస్తునే చదువుపైన ద్రుష్టిపెట్టాను. ‘మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. మీరు నన్ను పని చేసుకోనివ్వండని’ ఇంట్లో చెప్పాను. అటు నటన ఇటు చదువు రెండిటిని బ్యాలెన్స్ చేశాను. మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే హోర్డింగ్స్ పై నన్ను ఒక నటిగా చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఆనందపడ్డారు.

pragathi interview 1 e1695702342527

తెలుగులో ఏ హీరోతో వర్క్ చేయాలని అనుకుంటున్నారు ?

చాలా మంది వున్నారు. ముగ్గురు పేర్లు చెప్పాలంటే.. వరుణ్ తేజ్ గారితో వర్క్ చేయాలని వుంది. అలాగే రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఆయన నటన అద్భుతంగా వుంటుంది. అలాగే ప్రభాస్ గారితో వర్క్ చేయాలని వుంది.

ఒక నటిగా మీకు స్ఫూర్తి ఎవరు ?

సమంత గారి సినిమాలు ఇష్టం. అలాగే తాప్సీ గారి చేసిన కొన్ని సినిమాలు కూడా ఇష్టం. చాలా మంచి కథలు ఎంపిక చేసుకుంటారు. అలాగే త్రిష గారి సినిమాలు కూడా ఇష్టం.

pragathi new movie gam gam ganesha

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

‘గంగం గణేశా’ చేస్తున్నా. అలాగే ఇంకొన్ని కథలు వింటున్నాను. పెద్ధకాపు రిలీస్ అయిన, నా కంటూ ఓక గుర్తింపు వచ్చిన తర్వాత కొత్త సినిమాలకు సైన్ చెయ్యాలి అనుకొంటున్నాను.

ఒకే థాంక్స్ అండ్ అల్ ద బెస్ట్ ప్రగతి.

*కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *