IMG 20230809 WA0096

 

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా ’పెద్ద కాపు-1’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ ఈ రోజు నుంచి పొల్లాచ్చిలో జరుగుతోంది. లీడ్ పెయిర్ పై గ్రాండ్ గా చిత్రీకరిస్తున్న ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనాన్ని మునుపెన్నడూ చేయని విధంగా చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. మిక్కీ జే మేయర్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగల్ ‘చనువుగా చూసిన’ పాట సోల్‌ఫుల్ మెలోడీ ఆఫ్ ది సీజన్ గా చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

IMG 20230809 WA0121

హీరో విరాట్ కర్ణ ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం వున్న నటుడిలా ఇంటెన్స్ రోల్ లో చాలా సహజంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు.

నటీనటులు:

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ – రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *