‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ! రిలీజ్ ఎప్పుడంటే ! 

IMG 20250914 WA0539 e1757863426509

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు.

ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం మరియు మక్కువను ప్రదర్శించారు. చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత, తెరపై మరియు తెర వెలుపల కూడా ఆయన అసాధారణ వ్యక్తిగా మన్ననలు ఎందుకు అందుకుంటున్నారో మరోసారి నిరూపించింది. పవన్ కళ్యాణ్ ఎంతో నిబద్ధతతో ఈ సినిమా షూటింగ్‌లో తన భాగాన్ని పూర్తి చేశారు.

IMG 20250914 WA0538

ఈ కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి నటీనటులు మరియు సిబ్బందితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ అహర్నిశలు శ్రమించారు. టాకీ పార్ట్‌లో ఎక్కువ భాగం పూర్తి కావడం, షూటింగ్ సజావుగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై నెలకొన్న ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

  అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.

చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో చిత్ర బృందం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలు పెట్టనుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ మీద దండయాత్ర డిసెంబర్ లో ఉంటుందని సమాచారం అందుతుంది.

  దర్శకుడు హరీష్ శంకర్ నీ రిలీజ్ డేట్ గురించి అడిగితే, నేను మాత్రం నవంబర్ నెల ఆఖరకు మొదటి కాపీ సిద్ధం చేసి ఇచ్చేస్తాను, కానీ నిర్మాతలు మంచి డేట్ త్వరలోనే చెప్తారు అని అన్నారు.

సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సిద్ధం గా ఉండండి, త్వరలోనే విడుదల తేదీ తో అధికారిక ప్రకటన వస్తుంది.

తారాగణం:

పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, జయ ప్రకాష్, వర్గీస్, మీర్ సర్వర్, ప్రవీణ్, టెంపర్ వంశీ, నవాబ్ షా, శ్రీరామ్, మాగంటి శ్రీనాథ్, కిల్లి క్రాంతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక బృందం:

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్,  నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సి.చంద్రమోహన్ , ఛాయాగ్రహణం: అయనంక బోస్, కూర్పు: కార్తీక శ్రీనివాస్. ఆర్, కళ: ఆనంద్ సాయి, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్ పై, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నబకాంత మాస్టర్, మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *